By Village Missionary Movement
Wednesday, 22-Sep-2021దిన ధ్యానము(Telugu) 22.09.2021
అంశం: లెమ్ము
"ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను" - కీర్తనలు 106:30
దేవాది దేవుడు తన స్నేహితుడైన అబ్రాహాము సంతతి వారు క్రూరమైన ఇనుప కంచె వంటి ఐగుప్తులోనుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తీసుకొని వచ్చే మార్గంలో బాలకు అనే మోయాబు రాజును, కూలి కొరకు వంచనతో పనిచేసిన బిలము అనే వాడితో చేసిన కుయుక్తి వలన ఇశ్రాయేలీయులు బయల్పెయోరును వెంబడించి నిర్జీవమైన వాటికి సమర్పించిన బలులను భుజించి తమ క్రియల చేత దేవునికి కోపము రేపారు. కాబట్టి తెగుళ్ళు వాళ్ళ మధ్యలోనికి వచ్చాయి. ఇలా ఇశ్రాయేలీయుల మీదకు తెగుళ్ళు రావడానికి కారణం అయిన పాపమును నిలిపివేయుటకు ఫినెహాసు లేచి పరిహారం చేసెను అని కీర్తన 106వ అధ్యాయంలో చదువుతున్నాం. మన దేవున్నీ మిక్కిలి కోపిష్ఠిగా మార్చిన ఈ సంఘటన జరిగినప్పుడు ఫినెహాసు పాపము చేసిన గుంపుతో కలిసి పోలేదు మారుగా ప్రత్యక్షపు గుడారపు మధ్యలో మోషేతో కూడా కలిసి ఏడుస్తూన్నాడు. కాబట్టే జీమీని, కొజ్బీ ని చంపి వేయుటకు పౌరుషాన్ని, బలాన్ని పొందుకున్నాడు. మనం కూడా ఇలానే దేవుని కొరకు పౌరుషంతో జీవించాలి అంటే దెలీలా ఒడిలో నిద్రించే సమ్సోను వలె కాక తన మొఖమునకు రంగుల పూసుకొని యెజెబెలు యొద్ద తల వంచ కుండా ఆమెను పతనం చేసిన యెహూ వలె జీవించటకు మనలను సమర్పించు కుందాం.
ఈలాగు ఫినెహాసు లేచి న్యాయం చేసి, దేవుని కొరకు పౌరుషం చూపించినందు వలన ఆయనకు దొరికిన ఘనతలో ఒకటి సంఖ్యకాండం 23:13 ప్రకారం ఆయన తరువాత ఆయన సంతతి వారికి నిత్యమైన యాజకత్వ ఘనతను దయచేస్తాను అని దేవుడు ఒడంబడిక చేసిన దానిని చదువుతున్నాం. అంత మాత్రమే కాక 1దినవృ 9:20లో ఫినెహాసు ఇశ్రాయేలీయుల మీద విచారణ కర్తగా అధికారం గల వాడిగా ప్రభువు నియమించారు అనే దానిని చూస్తున్నాం. కాబట్టి మనం యేసయ్య కొరకు ఈలాగు నిలబడి కార్యములు చేసినప్పుడు మన ద్వారా ప్రభువు తన ప్రజలను కీడు నుండి తప్పిస్తారు అనే దాన్ని మనం గ్రహించగలము. కాబట్టి ఫినెహాసు నుండి ఇలాంటి పౌరుషాన్ని దేవుని యొద్దనుండి అడిగి పొందుకొని ఆయన నామ మహిమర్థమై మనకును, మన సంతతి వారికిని దీవెన కరముగా జీవిద్దాం.
- బ్రదర్. కె. బెంజమిన్
ప్రార్థన అంశం:-
నంబికై టి.వి మరియు సత్యం టి.వి ల్లో ప్రచారం అవుతున్న కార్యక్రమల ద్వారా అనేక మంది దేవున్ని తెలుసుకునేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250