By Village Missionary Movement
Tuesday, 21-Sep-2021దిన ధ్యానము(Telugu) 21.09.2021
అంశం:- జ్ఞానం లేని పక్షి, పురుగుల వ్యాపారి.
"నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి" - యాకోబు 1:16
మిక్కిలి అందమైన రంగులు గల పక్షి ఒకటి ఆహారం కొరకు అటు ఇటు ఎగురుతూ తిరుగులాడుతూ ఆహారం ఏమి దొరకక మిక్కిలి ఆకలితో ఒక చోట వచ్చి కూర్చుంది. అక్కడ ఉన్న పురుగుల వ్యాపారి పురుగులను డబ్బుల కొరకు అమ్ముతూ కనిపించాడు. మిక్కిలి ఆకలితో ఉన్న ఆ రంగుల పక్షి ఆ వ్యాపారి ఒక పురుగుని ఆహారం కోసం ఇవ్వమని అడిగింది. వెంటనే ఆ వ్యాపారస్తుడు డబ్బులు అడిగాడు. ఆ రంగుల పక్షి తన యొద్ద డబ్బులు లేనందున తన రంగుల గల రెక్కలలో ఒక ఈకను ఇస్తాను అని చెప్పింది. దానిని విన్న వ్యాపారి ఇది చాలా అందంగా ఉంది నేను దానిని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కదా అని తలంచి దాని రెక్కలలో గల ఒక ఈకను తీసుకొని ఒక పురుగును ఇచ్చాడు. చాలా ఆకలిగా ఉన్న ఆ పక్షి ఆ పురుగును నోట్లో పెట్టుకొని మింగేసింది. ఆకలి ఎక్కువగా ఉండడం వలన ఒక పురుగు దానికి చాలలేదు. వెంటనే వ్యాపారస్తుని దగ్గరకు వెళ్ళి మరియొక పురుగును ఇవ్వమని అడిగింది. ఆయన మరియొక ఈకను తీసుకొని పురుగును ఇచ్చాడు. ఇలా ఆ పక్షి తన మనస్సును అదుపు చేసుకోలేక తన ఈకలను ఇచ్చి పురుగులు తీసుకొని తినేసింది. ఇప్పుడు ఆ రంగులు గల పక్షి రెక్కలు లేని పక్షిగా మారిపోయింది. సరే కడుపు నిండింది కాబట్టి నేను గూటికి వెళ్తాను అని ఎగరడానికి ప్రయత్నం చేసి నప్పుడు ఎంతో బాధపడింది. వ్యాపారస్తుడు అయితే తన మార్గంలో వెళ్ళొపోయాడు. అప్పుడు తన యొక్క తెలివితక్కువ తనాన్ని గ్రహించింది ఆ రంగుల గల పక్షి. కొంత సమయంలోనే దానికంటే పెద్ద పక్షి వచ్చి ఆ రంగుల గల పక్షిని తినేసింది.
ఆవును దీనిని చదువుతున్నప్పుడు ఆ రంగుల గల పక్షి మీద జాలి మరియు ఆ వ్యాపారస్తుని పైన కోపం మనకు రావచ్చు. కానీ దీనిని చదువుతున్న మనం రంగుల పక్షి వలె తెలివి లేని వాళ్లుగా ఏదైనా ఒక విషయాన్ని లేదా మేలైన కార్యములను కోల్పోతున్నారా? మోసగాడైన శత్రువు ఈ వ్యాపార వేత్త వంటి వాడే మన శరీర ఆశలను రేపి దేవుడు మనకు ఇచ్చిన మేలైన ఈవులను కొల్లగొట్టుటకు వల వేస్తూవుంటాడు. 1పేతురు 5:8 లో రాసిన ప్రకారం మీ శత్రువైన సాతానుడు గజ్జించు సింహం వలె ఎవనిని మ్రింగుదునా అని వెదుకులాడుచున్నాడు. కాబట్టి ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్నట్టు మీరు నిబ్బరం కలిగి దైర్యంగా మెలకువ కలిగి వుండుడి. అన్నట్టు మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఈవులను అల్పమైన కార్యం కొరకు పోగొట్టుకోనకుండా జాగ్రత్తపడుడి. దేవుడు మీకు సహాయం చేయును గాక!
- సిస్టర్. జెబిన్
ప్రార్థన అంశం:-
దేవుడు మనకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చుటకు ప్రతి రాష్ట్రములో నుండి 12 మంది మిషనరీలను దేవుడు దయచేసేటట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250