Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.09.2021
Share:

By Village Missionary Movement

Monday, 20-Sep-2021

దిన ధ్యానము(Telugu) 20.09.2021

 

అంశం: శోధనలు జయించండి.

 

"మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు.... శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును" - 1కోరింథీయులకు 10:13

 

ఒక రోజు బాబు అనే చిన్నవాడి తల్లి నాలుగు కేకులను చేసిపెట్టి దుకాణానికి వెళ్ళింది. బయటకు వెళ్ళడానికి ముందు కేకులను సాయంత్రం అల్పాహారం కోసం చేసి ఉంచాను వాటిని అంతవరకు తినకూడదు అని బాబుతో చెప్పి వెళ్లారు. కేకు వాసన బాగా వస్తుండడంతో ఆశను ఎంతగా అణచుకోవాలి అని ప్రయత్నం చేసినా బాబు వలన కాలేదు. మూడు కేకులను తినేసాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి దానిని తెలుసుకున్న వెంటనే బాబు చేసిన తప్పు వలన బాబును గద్దించారు. బాబు మాత్రం అమ్మ కేకు వాసన చూడకుండా ఉండాలి అని ముక్కును చేతితో ముసుకున్నాను కాని ఊపిరి పీల్చుకోవడం కష్టం అవడం వలన చేతిని తీసేసాను. తరువాత నా కాళ్ళు నాకు లోబడకపోవడం వలన వంట గదిలోకి వెళ్ళాను. అక్కడకు వెళ్లిన వెంటనే నా చేతులు, నా నోరు కూడ నాకు లోబడలేదు అని అన్నాడు. 

 

అవును ప్రియమైన వారలారా! మనం కూడా కొన్ని తప్పులను తెలిసి చేసేసి పరిస్థితులు పైన లేదా కొంతమంది వ్యక్తుల పైన లేదా సాతాను పైన నింద మోపుతున్నాము. హవ్వ సర్పం మీద, ఆదాము హవ్వ మీద నింద మోపినట్లుగానే. నిజముగా శోధనకు ఎవరు కారణం? యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును అని వ్రాయబడి ఉన్నది. మన ఆశలు, శోధన కలిగించే కొన్ని రకములైన వస్తువులు, మనుష్యులతో కలిసినటువంటి కొన్ని రకములైన పరిస్థితులు మనలను శోధనల్లో పడవేస్తున్నాయి. ధన ఆశ గల ఒక అబ్బాయి లంచం అనే వలలో చిక్కి పోతాడు. వస్తువుల పై ఆశ గలవారు దొంగతనం అనే దారిలో నడుస్తారు. శరీరాశ వ్యభిచారంలో పడవేస్తుంది. పక్షులను గమనించి చూస్తే అది ఒక స్థలంలో నివాసం ఉండుటకు ముందు లేదా గూడు కట్టినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం ఉన్నదా అని చాలా లోతుగా గమనిస్తాయి. మనం ప్రతి రోజు మనకు రాకుడాని శోధన గూర్చి మెలుకువగా ఉండి ప్రార్ధించాలి. మార్కు సువార్త 14:38 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి అని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచన చెబుతున్నారు. పరలోక ప్రార్ధనలో మనం శోధనలోను, కీడులోను పడిపోకుండా ఉండుటకు ప్రార్ధించుట నేర్పిస్తున్నారు. చివరిగా యేసుక్రీస్తు చేసినట్లు పరిశుద్ద గ్రంధమునకు లోబడి శోధన కారుడైన సాతాను ఎదిరించి నిలబడాలి. శోధనలు జయించుటకు ప్రభువు చూపిన మనము నడుచుకుందుము గాక! 

- శ్రీమతి. గీత రిచర్డ్

 

ప్రార్థన అంశం:-

7000 మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామములను దర్శించేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al