By Village Missionary Movement
Sunday, 19-Sep-2021దిన ధ్యానము(Telugu) 19.09.2021 (Kids Special)
గ్రామ మిషనరీ యొక్క చిల్డ్రన్ స్పెషల్
"నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను" - కీర్తనలు 139:14
ఒక దట్టమైన అడవిలో జంతువులు, పక్షులు మరియు చిన్న చిన్న ప్రాణులు సంతోషంగా జీవిస్తువస్తున్నాయి. అడవి మధ్యలో ఒక కొలను కూడ ఉండేది. చేపలు కప్పలు ఎగురుతూ గెంతుతు అడుకొనుటకు చూడటానికి చాలా అద్బుతముగా ఉంటుంది. ఆ అడవిలో ఇద్దరు స్నేహితులు కూడా ఉండేవారు. మీకు స్నేహితులు ఉన్నారు కదా? వారితో మాట్లాడుతూ సరదాగా ఆడుకుంటారు కదా? అలాగే స్నేహితులైన కుందేలు, బాతు తరుచుగా కలుసుకొనేవి. ఒక రోజు బాతు కొలను ఒడ్డున నిలబడి ఉంది అప్పుడు నీటిని త్రాగడానికి వచ్చిన కుందేలు విచారముగా ఉన్న తన స్నేహుతుడైన బాతును చూచి ఏంటి ఏ రోజు నువ్వు చాలా బాధగా ఉన్నావు అని అడిగింది. దానికి బాతు నాకు నేనే నచ్చలేదు నా నోరు చాలా చిన్నదిగా ఉన్నది కొంగ వలె నోరు పొడవుగా ఉంటే చేపలు ఈజీగా పట్టి తినవచ్చు. అలా నా వలన కావడం లేదు. శరీరాన్ని చూడు పడవవలె ఉంది దానివలన ఆడుతూ నడవలేక పోతున్నాను అని చెబుతూ బాతు చాలా బాధపడింది.
అందుకు కుందేలు ఏంటి స్నేహితుడా నన్ను చూడు చెవులు పెద్దవిగా ఉన్నాయి. కాళ్ళను చూడు ముందు ఉన్న రెండు కాళ్ళు చిన్నవిగా వెనుక ఉన్న రెండు కాళ్ళు పెద్దవిగా ఉన్నాయి. కానీ దేవుడు మనలను ఇలా సృష్టించడం మంచిదే అని కుందేలు చెప్పింది. ఎలా మంచిది అని చెబుతున్నావు అని ప్రశ్నించింది బాతు. ఒకరోజు అడవిలో సింహం గర్జించిన శబ్దం వినబడింది వెంటనే నా పెద్ద చెవులను ఉపయోగించి ఎక్కడనుండి ఆ శబ్దం వచ్చిందో అని గుర్తుపట్టెను. నన్ను చంపుటకు నా దగ్గరకు వచ్చిన సింహం నుండి తప్పించుకొనుటకు నా కాళ్ళ ద్వారా వేగంగా పరిగెత్తుతు తప్పించుకున్నాను. అప్పుడే ప్రభువు నన్ను ఎంత ప్రత్యేకంగా సృష్టించారు అనేది తెలుసుకొని ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపాను అని కుందేలు చెప్పిన వెంటనే బాతు వేగంగా నీటిలోనికి దిగి రెండు చేపలను పట్టి తింటూ చెప్పింది అవును స్నేహితుడా నువ్వు చెప్పింది నిజమే మనలను ఆ ప్రభువు చాలా ప్రత్యేకంగా సృష్టించారు. ఇకపై బాధపడకుండా సంతోషంగా ఉంటాను అని చెబుతూ బాతు కొలనులోకి వెళ్ళిపోయింది.
ఏంటి పిల్లలు కధ చదివారా? మీరు కూడా బాతు వలె బాధ పడుతున్నారా? నేను నలుపుగా ఉన్నాను, ముక్కు చిన్నదిగా ఉన్నది అని బాధపడకుడదు.యేసయ్య మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించుట వలన విశేషంగా ప్రేమిస్తున్నారు కదా. యేసయ్య ప్రేమను పొందుకున్న మీరు కూడా ప్రత్యేకమైన వారే గదా. సో డోంట్ వర్రీ.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250