Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.09.2021
Share:

By Village Missionary Movement

Saturday, 18-Sep-2021

దిన ధ్యానము(Telugu) 18.09.2021

 

అంశం:- నిలకడలేని హృదయమా చిరాకుపడవద్దు.

 

"మ్రోద్దేకయ్ వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి" - ఎస్తేరు 3:5

 

మనం ఉపయోగించే కార్, బైక్ వాహనాల భాగాలలో ఇంజన్ లో ఉష్ణం పెరుగుట వలన ఉపయోగం యేమియును లేదు. అది బండి నడవడానికి ఆటంకంగా ఉంటుంది. ఇది జరుగుటకు కారణం ఏమిటి? పొడిగా ఉన్న భాగాలు ఒకటికి ఒకటి తాకుతాయి ఇలా తాకకుండా ఉండుటకు నూనెను పోయాలి. యంత్రంలో ఉష్ణం అధికంగా ఏర్పడటం చాలా ప్రమాదకరం. అదేవిధముగానే మన జీవితంలో చిరాకు లేదా కోపం కీడుని కలుగ జేస్తుంది. పరిశుద్ధ గ్రంధంలో ఎస్తేరు అనే పుస్తకంలో ప్రస్తావించబడిన బబులోను రాజు అయిన అహస్వరోషు హామాను అను వానికి అధిపతులందరికంటే తన స్థానమును ఉన్నతముగా ఉంచెను. హామానును చూచినప్పుడు రాజాసేవకులందరు మోకాళ్ళూని నమస్కారించాలి అని రాజు ఆజ్ఞ ఇచ్చారు. కాని మ్రొద్ధేకై మాత్రం మోకాళ్ళూని నమస్కరించలేదు. అది చూచిన హామాను బహుగా కోపగించాడు. మ్రొద్ధేకై ప్రాణము తీయుట స్వల్ప కాలం అని యెంచాడు. అందువలన రాజ్యమందంతట మ్రొద్ధేకై సహోదరులైన యూదులందరిని సంహరించుటకు ఆలోచించాడు. కాని తనకి వ్యతిరేకముగా అయ్యింది. అందవలన హామాను మ్రొద్ధేకైకి సిద్ధము చేసిన ఉరికొయ్యి మీద హామానునే ఉరి తీశారు. 

 

హామాను యొక్క జీవితం ఎందుకు అలా అయ్యింది? ఒక చిన్న కోపం మనసులో ఉంచుకొనుట వలనే. మన జీవితంలో ఏదోఒక మోసము, ఇతరుల యెడల కృతజ్ఞత లేకపోవడము, అమర్యాదగా నడుచుకుంటున్నారు అనే ఆలోచన వీటివలన మనకు చిరాకు కోపం ఏర్పడుతుంది. అది మన జీవితము యొక్క పరుగున సౌకర్యవంతముగా సాగకుండా అడ్డుపడుతుంది. కోపిష్టుడు , అని అనిపించుకోకుండా దేవుని మాటలు పరిశుద్ధాత్ముని అభిషేకం మనలను నడిపించనీయుడి. ప్రభు తన ప్రేమను సహాయమును 1000 దారులలో చూపిస్తారు. మన యొక్క నిరుత్సాహతలన్నీ ఆయన యొక్క నియామకాలే. అందువవలన కోపం చిరాకును పోగొట్టుకొనుటకు దేవుని సన్నిధిలో ప్రార్ధించాలి. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతికలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాము అని గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం లో వ్రాయబడి ఉన్నది. అందువలన నిలకడలేని హృదయమా ప్రభువునే నమ్ము హల్లేలూయ! 

- సహోదరి: ఏ.బ్యూలాగారు

 

ప్రార్ధనా అంశం:-  

ఆంధ్రా,ఒరిస్సా , ఛత్తీస్ఘడ్ ప్రాంతాలలో పని చేస్తున్న సేవకులకు అత్యవసరాలు తీర్చబడేలాగ ప్రార్ధించండి.,,

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet