Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.09.2021
Share:

By Village Missionary Movement

Friday, 17-Sep-2021

దిన ధ్యానము(Telugu) 17.09.2021

 

అంశం:- ఎక్సపైర్ డేట్.

 

"మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము" - కీర్తనలు 90:10

 

మనం ప్రతిరోజు ఉపయోగించే వస్తువులు దుకాణంలో కొని వినియోగించే కొన్ని వస్తువులలో ఎక్సపైర్ డేట్ అని ఒకటి వ్రాయబడి ఉంటుంది. ఆ ఎక్సపైర్ డేట్ పూర్తి అవ్వడానికి మునుపే మనం దానిని వాడి పూర్తి చెయ్యాలి లేదంటే ఎటువంటి వస్తువు అయిన సరే ఎంత డబ్బు ఇచ్చి కొన్న సరే ఆ వస్తువులను మనం ఉపయోగించలేము. ప్రముఖ్యంగా అది తినే వస్తువు అయితే అది పాడైపోతుంది. అందువలన మనం సామాన్లు కొనేటప్పుడు దాని ఎక్సపైర్ డేట్ చూసి కొనుటలో శ్రద్ధ చూపించాలి. దేవుని ద్వారా ఈ భూమి పై సృష్టించబడిన అందరిలో ఎక్సపైర్ డేట్ ఉంటుంది. దేవుడు మనలను ఎటువంటి ప్రణాళిక లేకుండా ఆయన మనలను సృష్టించలేదు. అందువలన దేవుని కొరకు మనం చేయవలసిన అన్ని పనులను పూర్తి చెయ్యాలి. 

 

పరిశుద్ద గ్రంధంలో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరును యేసుక్రీస్తు తలపై పోసింది. అప్పుడు యేసు ఆ స్త్రీని గూర్చి ఈమె తన శక్తి కొలది చేసినది అని చెప్పారు. ఆ స్త్రీ అంత గొప్ప సాక్ష్యం పొందుకున్నది. ఈ స్త్రీ యొక్క ఎక్సపైర్ డేట్ పూర్తి అవ్వడానికి ముందు పరలోక దేవుని ద్వారా మంచి సాక్ష్యన్ని పొందుకొని తన పనిని పూర్తి చేసింది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ప్రతి మనిషికి ఆయుష్ కాలము 70 సంవత్సరాలు అధిక బలము ఉన్న యెడల 80 సంవత్సరాలు ఉండవచ్చు. కావున భూమి పైన మనం జీవించే కాలంలో దేవుని కృప ద్వారా ఇవ్వబడిన జీవిత కాలంలో మనం చేయ గలిగినంత వరకు ఎక్సపైర్ డేట్ పూర్తి అవ్వడానికి ముందే మనం వీలైనంత వరకు చేద్దాం. మన యొక్క జీవిత కాలమును బలము కలిగినదిగా మార్చి నడుచుకుందాం. కాబట్టి ప్రతి రోజు ప్రభువైన యేసుక్రీస్తుని బయభక్తితో సేవించుట నేర్చుకుందాం. దేవుని యొక్క కృపను పొందుకొనుటకు ఆశ పడదాం. దేవుడు మీ ఆశను నెరవేర్చును గాక! ఆమెన్.

- శ్రీమతి. బేబీ కామరాజ్ 

 

ప్రార్థన అంశం: 

ఆంధ్రలో రేగ పుణ్యగిరి అనే ప్రాంతంలో సంఘం కట్టే పనులు త్వరగా పూర్తి అయ్యేటట్లు, ఆవసరతలు సంధింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet