By Village Missionary Movement
Wednesday, 15-Sep-2021దిన ధ్యానము(Telugu) 15.09.2021
అంశం:- పగలగొడతారు అభివృద్ధి చెందుతాము.
"కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను" - యిర్మియా 18: 4
దేవుని పని అంటేనే అది మనయొక్క దృష్టికి పూర్తిగా తారుమారుగా ఉంటుంది. చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఉన్నట్టు ఉండి మట్టిని తీసుకొని తినడం ప్రారంభించారు. కన్నవారు వెంటనే వారి చేతి పైన ఒక దెబ్బ కొట్టి వారిని మట్టి తినకూడదు అని చెప్పారు. పిల్లలకు అది చాలా బాధ అనిపించి ఏడ్చారు. తరగతి గదిలో మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు మన స్వభావము బట్టి మనం అల్లరి చేస్తాము. వెంటనే ఉపాధ్యాయులు మనలను గద్దిస్తారు. కొన్ని సమయాల్లో మనలను కొడతారు అది మనకు చాలా బాధ అనిపిస్తుంది. కాని ఇప్పుడు విన్న రెండు కార్యములు కూడా మనలను సరిచేసే దారులే.
పరిశుద్ద గ్రంధంలో దేవుడు తన ప్రజలను ఎలా చూస్తున్నారు అని యిర్మీయా 18వ అధ్యాయము ద్వారా మనం గ్రహించగలం. దేవుడు తన ప్రజలను కుమ్మరి చేతిలో మట్టి పాత్రలు వలె తయారు చేసి నప్పుడు అనుకోకుండ అది పగిలిపోయింది. కానీ ఆ కుమ్మరి దృష్టికి ఆ జిగట మన్ను మంచిదిగా ఉండడం వలన దానిని త్రిప్పి నొప్పిని కలిగించి ఊహించని పరిస్తితుల్లో ఉపయోగించే వేరే పాత్రగా తయారు చేశారు. దేవుడు తన ప్రజలను ఈ పనికి పోల్చి మాట్లాడి మంచి మార్గంలో నడిపించాలి అనేదే కారణం.
ప్రియమైన వారలారా దేవుడు మన కుమ్మరి మనం ఆయన చేతిలో ఉన్న జిగట మట్టి. మన స్వభావమును బట్టి కొన్నీ సమస్యలు, పొరటములు, శోధనలు అనుమతించి మనలను పగలగొట్టుటకు ప్రణాళిక కలిగి ఉన్నారు. దేవుడు మన దృష్టికి మంచిది అగుటకు మనలను వేరే పాత్రగా తయారు చేస్తున్నారు. అనగా మనలను మన స్వభావమును మార్చుతారు, తరువాత మనము ఉపయోగించ బడుతున్నాము. దేవుని నామమును మహిమ పరుస్తున్నాము. అయితే మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం దేవుడు మనలను పగలగొడతారు కాబట్టి మనము కృంగిపోక అభివృద్ధి చెందుతాము. కాబట్టి మనలను దేవుని హస్తంలో అప్పగించు కుందాం. దేవుని కొరకు వాడబడదాం.
- బ్రదర్. టి. శంకర్ రాజ్
ప్రార్థన అంశం:-
మీడియా పరిచర్యల ద్వారా సంపాదించబడుతున్న ఆత్మలు ఇంకా దేవునీలో బలపడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250