By Village Missionary Movement
Monday, 13-Sep-2021దిన ధ్యానము(Telugu) 13.09.2021
అంశం:- స్వస్థ పడగొరుచున్నవా?
"...స్వస్థపడ గోరుచున్నావా?" - యోహాను 5:6
యేసుక్రీస్తు ప్రభువు యూదుల పండుగ కొరకు యెరూషలేమునకు వచ్చినప్పుడు గొర్రెల ద్వారము నొద్ద బేతెస్ద అనబడిన ఒక కోనేరు యొద్దకు వెళ్లారు. అక్కడ 38 సంవత్సరాలుగా వ్యాధితో పడిఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. యేసు అతని దగ్గరకు వెళ్ళి స్వస్థ పడగొరుచున్నవా అని అడిగిన విధానమును పరిశుద్ద గ్రంధంలో చదువుతున్నాం. స్వస్థత పడాలని అనుకోకుండా అతను అక్కడ ఉంటాడా? ఇదేం ప్రశ్న అని ఆలోచన వస్తుంది కదా ఇతను 38 సంవత్సరాలు అక్కడ పడి ఉంటే జీవితంలో నమ్మకం లేని వాని వలె మరణం వరకు ఈ స్థలమే నాకు అనే బాధతో, విరక్తితో ఉండి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో హృదయం అంత బాధతో నిండి యున్నప్పుడు అతను తన స్థితిని ఎరిగి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఈ ప్రశ్నను అడిగారు. ఇతనైన నన్ను మొదట ఆ బేతెస్ద కొనేరులో మొదట నన్ను దింపుతారు అని ఆలోచించి ఉండవచ్చు. తనను ప్రశ్న అడిగిన వారు యేసుక్రీస్తు అని అతను గ్రహించలేదు. తన పరిస్థితిని ఆయన యేసు యొద్ద చెప్పాడు. అందుకు ఆయన వెంటనే నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుము అని చెప్పారు. అందుకు అతను దేవుని మాటకు లోబడి లేచాడు, నడిచాడు, స్వస్థత పొందుకున్నాడు. ఎంతటి అద్భుతం చూడండి. యేసుక్రీస్తు అతనికి ఆ ప్రశ్న అడగకుండానే మామూలుగానే లేచి నీ పరుపు ఎత్తుకొని నాడువుము అని చెప్పి ఉంటే అతను వెంటనే లోబడి లేచి స్వస్థత పొంది ఉంటాడు అనే దానిలో సందేహమే. అతనిని స్వస్థపరచుటకు ముందు స్వస్థత పొందుటకు అతనిని సిద్ధపరుచుటకే ఈ ప్రశ్నను అడిగారు.
ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని చూస్తూ అడుగుతున్నారు. నీవు స్వస్థపడగొరుచున్నవా అని. మొదటిగా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అనేది గ్రహించాలి. మన ఆత్మలో బలహీనం, అనారోగ్యం ఉండవచ్చు, మద్యం, సిగెరెట్, డ్రగ్స్ మరియు అనేక చెడు అలవాట్లకు బానిస అయి ఉండవచ్చు. లేదా వాటిని విడిచి పెట్టాలి అనే ఆలోచన కూడా లేక ఉండవచ్చు. దీనిని చదువుతున్న ప్రతి ఒక్కరికి ఇది ప్రభువు ఇచ్చే పిలుపు అయి ఉన్నది.
ప్రభువా నేను స్వస్థత పడగొరుచున్నాను నీ రక్తంతో నా పాపములను కడిగి నన్ను పరిశుద్ద పరిచి నన్ను విడుదల చేయు అని వెంటనే ప్రభువు యొద్ద అడగండి. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును అనే వాక్యం ద్వారా పాపముల నుండి విడుదల పొందుకుంటారు. వ్యాధుల నుండి స్వస్థత పొందుకుంటారు. ఆయన యొక్క ప్రేమ గల స్వరానికి లోబడితే వెంటనే విడుదల, ఆశీర్వాదం పొందుకుంటారు. నీవు స్వస్థపడగొరుచున్నవా? ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువు చెంతకు రా! ఆమెన్.
- శ్రీమతి. భువన ధన బాలన్
ప్రార్థన అంశం:-
తోటి సహాయక సేవకుల ద్వారా సంధింప బడుతున్న సంఘములు లేని గ్రామాలలో సంఘములు కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250