Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.09.2021
Share:

By Village Missionary Movement

Saturday, 11-Sep-2021

దిన ధ్యానము(Telugu) 11.09.2021

 

అంశం: వెంబడించే మంచి లక్షణం

 

"మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను" - యోహాను 8:12

 

ఒక ప్రఖ్యాతి గాంచిన నటుడు తనను అనుసరించే వారికి అనేక సహాయములు చేస్తాను అని చెప్పారు. నేను అది సాధిస్తాను, ఇది సాధిస్తాను అని పనిలో మార్పును తీసుకొస్తాను అని అనేక ప్రమాణాలు చేసాడు. అతను సినిమాల్లో పొందుకున్న విజయాలు చూసి ఆయన చెప్పెది నిజం అని నమ్మి అనేకులు ఆయనను వెంబడించారు. కాని అతను తన నిర్ణయాన్ని మార్చుకొని తాను ఏర్పరచిన అన్ని సంఘములను లేకుండా చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అతనిని వెంబడిస్తు వస్తున్న అనేకులు మోసపోయారు. ఇప్పటికి మోసపోయిన వారు ఓడిపోయిన వారు అనేకులు. ఇదే విధంగా ఇప్పటికి చాలా మంది సినిమా నటులు లేదా అధికారుల యొక్క బాహ్యమైన జీవితం చూసి వెంబడించి మోసపోయిన వారు అనేకులు. 

 

వారి యొక్క నిజమైన జీవితమును లోతుగా చూసినట్లయితే వారు చెప్పినట్లు చేసేదే లేదు. వీరు చెప్పింది నమ్మి అనేక మంది యవ్వనులు తమ జీవితమును పాడు చేసుకుంటున్నారు. ఒక చీకటి గల జీవితంలోనికి వెళ్లిపోతున్నారు. దారి తెలియక పిలుస్తున్న ఒక పెద్ద యవ్వన సమావేశమే ఉంది. ఒక వేళ మీరు లోకంలో ఉన్న ఏ మనుష్యులను నమ్మిన మోసపోయే అవకాశం ఉంది. కాని యేసుక్రీస్తు చెబుతున్న మాట నన్ను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని. యోహాను 8వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు మాటతో చెప్పడం మాత్రమే కాదు ఈ లోకంలో జీవించి చూపించారు. చిన్న వయస్సు నుండి సుమారు ముప్పై సంవత్సరాలు వచ్చేవరకు తన తల్లిదండ్రులకు లోబడి నడుచుకున్నారు. తన శిష్యుల పాదములు కడిగారు. దయ్యం పట్టి చీకటిలో జీవిస్తున్న అనేకులకు విడుదల ఇచ్చారు, గ్రుడ్డి వారి కనులు తెరిచారు, కుంటి వారిని బాగుచేశారు. ఎంతో మంది ఆయనను విశ్వసించలేదు. ఆయన మొఖం పై ఉమ్మి వేశారు, చివరిగా సిలువలో వేసేసారు. మన యొక్క పాపముల నుండి విడుదల ఇవ్వడం కొరకు రక్తం చింది మరణించి మూడవ దినమున తిరిగి లేచారు యేసుక్రీస్తు. ఇప్పటికి జీవం కలిగి ఉన్నారు. ఆయనను ఎవ్వరు వెంబడించిన సరే వారి యొక్క సమస్త చీకటిని తొలగించి ఆయన యొక్క పరిశుద్ద రక్తంతో కడిగి విడుదల ఇస్తారు. మీ యొక్క జీవితమును ప్రకాశవంతంగా మార్చి మిమ్మును ఆశీర్వదిస్తారు. 

- బ్రదర్. పి.వి.విలియమ్స్.

 

ప్రార్థన అంశం:-

మిషనరీ పిల్లల యొక్క స్కూల్ ఫీస్ కట్టుటకు గల ఆవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet