Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.09.2021
Share:

By Village Missionary Movement

Friday, 10-Sep-2021

దిన ధ్యానము(Telugu) 10.09.2021

 

అంశం: ఉన్నతమైన పొగడ్త.

 

"ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను" - ఫిలిప్పీయులకు 3:11

 

సైబీరియన్ అనే ప్రఖ్యాతి గాంచిన న్యాయమూర్తి 40 సంవత్సరాల వయస్సు వరకు ప్రభువును ఎరుగని వాని వలె ఉండే వాడు. సెరివియస్ అనే క్రైస్తవ స్నేహితుని వలన యేసుక్రీస్తు ను అంగీకరించిన వెంటనే బాప్తిస్మము తీసుకున్నారు. క్రీస్తును గూర్చి ప్రకటించే సువార్తను ప్రకటించే వారిగా మారేడు. తన ఇంటిని అమ్మి పేద, అనాధ ప్రజలకు సహాయం చేసారు. తాను ఉన్న ప్రాంతంలో అంటూ వ్యాధి వ్యాప్తి చెందడం వలన అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయారు. చాలా మంది పిల్లలు తమ కన్నవారిని కోల్పోయారు. అది మాత్రమే కాకుండా అక్కడ కరువు కూడా ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో సైబీరియన్ అనేకులకు సహాయం చేసారు. అనేకులు అతని వలన సహాయం పొందుకొని క్రీస్తుని అంగీకరించారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోమన్ చక్రవర్తి అయిన వలెరియన్ సైబీరియన్ క్రీస్తును గూర్చి ప్రకటించడం వలన అతనిని ఖైదీగా చేసి బంధించారు. పరిశుద్ద గ్రంధంలో అపోస్తులుడైన పౌలు తన గురించి చెప్పినప్పుడు నేను ఇశ్రాయేలు వంశపు వాడను, హెబ్రీయులు, పరిసయ్యులు పైన భక్తి, శ్రద్దల నిమిత్తం సంఘం ను హింసించుటకు అధికారం పొందుకున్న వాడిని. ఇలా చాలా అహంకారం ఉన్నప్పటికీ ప్రభువు ముందు ఇవి అన్ని వ్యర్థం. క్రీస్తు నా జీవితంలో ప్రాణం కంటే ఎక్కువ దాని ముందు నాకు ఉన్న గర్వం సున్నం. అందువలన దానిని లాభముగా ఎంచుకొనక పెంట గాను ఎంచుకున్నాను. యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమే శ్రేష్ఠమైనది. ఆ జ్ఞానమే నాకు నిత్యా జీవం ఇచ్చింది. ఆయన ముందు నా ప్రాణం గొప్పది కాదు. యేసు క్రీస్తు యొక్క సువార్తను అనేక ప్రాంతములకు తీసుకు వెళ్ళి ప్రకటించి ఆయన కొరకే మరణించారు. 

 

ప్రియమైన వారలారా! సైబీరియన్ ఏమి లేని వాడు కాదు ఆయన ఒక న్యాయమూర్తి, ప్రముఖ మైన వాడు జ్ఞానంతో నిండిన వాడు. ఆయన క్రీస్తుని ఎరిగి దేవుని సువార్తను గొప్పగా తలంచి తన జీవిత కాలం అంత క్రీస్తు కొరకే జీవించి ఆయన కొరకే మరణించారు. పరిశుద్ద గ్రంధంలో పౌలు కూడా ఇదే విధంగా జీవించాడు. తనకు ఉన్న సమస్తమును పెంట కుప్పతో సమానముగా ఎంచుకున్నాను అని అన్నారు. మరి మీరు మీ జీవితంలో దేనిని గొప్పగా పరిగణిస్తున్నారు. డబ్బు, విద్య, సంపద, పొగడ్త, పదవీ అని అనుకుంటున్నారా? వీటి కొరకు క్రీస్తుని విడిచిపెట్టారా? ఒక్క నిమిషం అలోచిద్దాం. క్రీస్తుతో కలిసి ఉందాం, పౌలు వలె సమస్తమును క్రీస్తు కొరకు ఉపయోగించి ఆయన కొరకు జీవిద్దాం. క్రీస్తు కొరకు దేనినైనా కోల్పోవచ్చు కాని దేని కొరకు క్రీస్తుని మాత్రం కోల్పోకుడదు. 

- బ్రొథెర్. బి. ఆల్విన్ జాకబ్

 

ప్రార్థన అంశం:-

మన చిల్డ్రన్ హోంలో 10th చదువుదున్న పాండి మరియు అజయ్ దేవుడు విశేషమైన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet