Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.09.2021
Share:

By Village Missionary Movement

Thursday, 09-Sep-2021

దిన ధ్యానము(Telugu) 09.09.2021

 

అంశం: ఐక్యత

 

"సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!" - కీర్తనలు 133:1

 

ఒక రైతు ఇంట్లో ఎలుక, కోడి, పిల్లి, మేక ఉండేవి. రైతు ఎలుకలు ఎక్కువైపోయాయే వాటిని ఎలాగైనా లేకుండా చేయాలి అని వాటిని పట్టుకొనుటకు ఉరి కొనుక్కొని వస్తాను అని అన్నారు. ఎలుక వెంటనే కోడి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పి సహాయం అడిగిన వెంటనే ఆ కోడి చెప్పింది నీకు నేను సహాయం చేయలేను అని, ఆ తరువాత మేక దగ్గరకు వెళ్ళింది. మేక ముద్దుగా పెరిగే నేనే ఇంటిలోపలికి అప్పుడప్పుడు వెళ్తాను నువ్వు ఎల్లప్పుడూ లోపలే ఉండి గంతులు వేశావ్ కదా! నీకు ఇలానే జరగాలి అని అన్నది. ఎలుక పిల్లి దగ్గరకు వెళ్ళి సహాయం అడిగింది అందుకు పిల్లి చెప్పింది నవలన కావట్లేదు అతనైన ఆ మంచి పని చేయనియ్ అని అన్నది. రైతు ఎలుకను పట్టే ఉరిని కొని ఉంచారు. ఎలుకను పట్టుకొనని పిల్లి వద్దు అని పిల్లిని పట్టుకొని అడవిలో వదిలేశారు. రైతు యొక్క కుమార్తె తెలియకుండా ఆ ఉరి లో చేయి పెట్టిన వెంటనే టప్ అని శబ్దం రావడం వలన కుమార్తె అరచింది. తండ్రి వెంటనే వచ్చారు రైతు కుమార్తె చేయి చిక్కుకొని పోయి ఉన్నది. రక్తం ఎక్కువగా కారుతూ ఉంది. వైద్యుని తీకొని వచ్చారు. వైద్యుడు ఆ కుమార్తెకు తొందరగా నయం కావాలి అంటే నాటు కోడి కూర వండి పెట్టమని చెప్పారు. కోడిని వండటం వలన కోడి లేకుండా పోయింది. స్వస్థత పొందిన వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికొఱకు మేకను చంపి వండి పెట్టారు రైతు. నాకు సహాయం చేసి ఉంటే అందరూ ప్రాణంతో ఉండి ఉండేవారు అని అనుకున్నది ఎలుక ఇప్పుడు నేను ఒక్కదాన్నే మాత్రమే ఉన్నాను అని అనుకున్నది ఎలుక.

 

పరిశుద్ధ గ్రంథంలో పక్షావాయువు అనే వ్యాధి వచ్చి నడవలేక పడకలోనే పడియున్న ఒక స్నేహితుని చూచి మిగతా నలుగురు యేసు యొద్దకు తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నారు. అందుకు చాలా ఆలోచించి పరుపుతోనే తీసుకు వెళ్ళాలి అని నిర్ణయించి తీసుకు వెళ్ళారు. కాని వారు యేసు యొద్దకు వెళ్ళ లేకపోయారు. అయిన సరే ప్రయత్నాన్ని విడువక ఇంటి పై కప్పును విప్పి సందు చేసి, పక్షవాయువు గల తన స్నేహితుని యేసు ముందు దింపారు. యేసు ఆ నలుగురు స్నేహితులు ఐక్యత కలిగి ఉండుటచూచారు. ఆయనను స్వస్థపరచారు. 

 

ఇది వింటున్న ప్రియులారా! మీరు నివసిస్తున్న స్థలంలో సమీపంగా ఉన్నవారితో , ఉద్యోగం చేస్తున్న స్థలంలో తోటి ఉద్యోగులతో ఎలా ఉంటున్నారు? ఐక్యతగా ఉంటున్నారా? చేదు, ద్వేషం లేకుండా క్షమాపణ సహనంతో ఉంటున్నారా? అలా ఉంటే మీకు సహాయం చేయుటకు తోటి ఉద్యోగస్తులు లేదా తోటి సమీపస్తులు లేదా స్వంత బంధువులు మీకోసం పరిగెత్తుకొని వస్తారు. మీరు కుడా సంతోషంగా ఉండవచ్చు. ఐక్యత కలిగి ఉన్న జీవితం ఆశీర్వాదమైన జీవితం. సహోదరులు ఐక్యత కలిగి ఉన్న జీవితం మేలు మనోహరము అనేది వేద వాక్కు అందరితో ఐక్యత కలిగి బ్రతుకుదాం, మేలు మనోహరమును పొందుకుందాం. 

- సహోదరుడు. అరుణ్ అయ్యప్పన్ 

 

ప్రార్థన అంశం:-

మన సేవలో ఉన్న ద్వీచక్ర మరియు నాలుగు చక్ర వాహనాలు చక్కగా పనిచేయుటకు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet