Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.09.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 08-Sep-2021

దిన ధ్యానము(Telugu) 08.09.2021

 

అంశం:- నన్ను బలపరిచే శక్తి

 

"నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను" - ఫిలిప్పీయులకు 4:13

 

నేను దేవుని సేవలో గడిచిన 20 సంవత్సరాలుగా ప్రసంగం చేస్తున్నాను. 2021మార్చి 9వ తేదీ సాయంత్రం కూడికలో వాక్యం చెప్పమని నా సంస్థ యొక్క ప్రాథమిక సహోదరుడు అడిగారు. అది నా ముందు గొప్ప సవాలుగా ఉంది. కారణం శరీరంలో బలహీనతతో వ్యాధి గ్రస్తురాలైన నా భర్య 79 రోజులు హాస్పిటల్లో తీవ్రమైన చికిత్స పొందుతూ 12 రోజులు ఇంట్లో చికిత్స పొందుతూ ఉంది. చివరిగా అన్ని ప్రయత్నాలు విఫలమై ప్రభువు నందు మృతిపొంది మార్చి 8వ తేదీన పాతిపెట్టబడ్డారు. 

 

అటువంటి పతిస్థితుల్లో మార్చి 9వ తేదీన సుమారుగా 500 మంది వరకు కూడి ఉన్న కూటములో దేవుని మాటలను ఒక గంట సమయం వరకు బలంగా ప్రసంగించాను. చెప్పుకోలేని విషాదములు బింధువు వలె వచ్చి కన్నుల కన్నీరు కారుతున్నప్పుడు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని ప్రసంగించాను. కూటమి చివరిలో అనేకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూనే వున్నారు. అందులో ఒక ఆయన నా దగ్గర వచ్చి ఈరోజు మీరు ఎలా ప్రసంగించ గలిగారు అని అడిగారు ఆశ్చర్యముగా. అందుకు అంత దేవుని కృపయు, ఆయన శక్తియే అని చెప్పాను. 

 

పౌలు తన తోటి సేవకుడైన తిమోతికి వ్రాసినప్పుడు మంచి పొరటమును పోరాడితిని నా పరుగు కడ ముట్టించితిని అని అన్నారు. చాలా కఠినమైన సవాళ్ళను ఎదుర్కొని ఒక దానిలో కూడా అధైర్య పడి వెళ్ళి పోకుండా పౌలు తాను గెలిచి సవాళ్లను విసురుతున్నారు. ఇంకా కోరింతీయులకు వ్రాసిన పత్రికలో మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు చున్న దేవునికి స్తోత్రం అని చెప్పారు. క్రైస్తవ జీవితంలో మనం తలంచని పొరటములు, సవాళ్లు మన ముందు ఉంచబడ్డాయి అయినప్పటికీ విజయం మనకే. అందువలన దేవుని కృపను అనుకోని సవాళ్ళను ఎదుర్కొనండి. 

- బ్రదర్. పి. జాకబ్ శంకర్

 

ప్రార్థన అంశం:-

గ్రామ పరిచర్య చేయుటకు మెగా ఫోన్ అవసరం దీని కొరకు సంఘముగా లేదా కుటుంబంగా ఎవరైనా బాధ్యత తీసుకొనే విధంగా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet