By Village Missionary Movement
Monday, 06-Sep-2021దిన ధ్యానము(Telugu) 06.09.2021
అంశం:- జీవించి చూపుటయే క్రైస్తవ్యం.
"మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" - మత్తయి 5:16
అంతియోకియలో శిష్యులు మొట్ట మొదట క్రైస్తవులు అని పిలవబడ్డారు. మన పూర్వీకులు అయిన అది క్రైస్తవ తరాలు క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఈ రోజు మనకు ఉన్న సత్య వేద బోధనలు, ఉల్లాసమైన మేల్కొలుపు, ఆరాధనలు ఆ రోజు వారికి లేవు. కాని వారి యొద్ద కనిపించే దేవుని ప్రేమ, వినయము, ఇతరులకు సహాయం చేసే మనస్సు సానుభూతి కలిగిన సంరక్షణ, నిజం, నిజాయితీ, క్రమశిక్షణ ఈ మంచి లక్షణాలు వలన విచిత్రంగా కాంతి వంతంగా కనిపించే క్రైస్తవులు అని పిలవబడ్డారు. మంచి లక్షణాలతో నిండిన ఆత్మీయ వరములను కలిగి ఉండేవారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచ వ్యాప్తంగా మేలు చేస్తూ కరుణించి చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించారు. అయినప్పటికీ లోకంలో పలు రకాల పాపములు అయిన హత్య, దొంగతనం, లైంగిక వేధింపులు, వ్యభిచారం అధికముగా కనిపిస్తున్నాయి. కొంత మంది క్రైస్తవులు కూడా హద్దులు లేకుండా ఇటువంటి పాపములో మునిగి క్రీస్తు లేకుండా జీవిస్తున్నారు. క్రైస్తవులు అయిన మనలో నీతి అనే కాంతి లేనప్పుడు మనం లోకానికి ఎలా వెలుగుగా జీవించగలము.
పాప చీకటిలో, అజ్ఞానములో, మూఢనమ్మకాలలో బ్రతికే మనుష్యులకు యేసుని చూపించే ప్రతినిధులుగా జీవించాలి అని దేవుడు మనలను ఏర్పరుచుకున్నారు. అనగా జనులు మనలో యేసు యొక్క గుణములు అయిన మంచి లక్షణాలు కాంతిని చూడాలి. స్వార్థం, అహంకారం, ఆధిపత్యం, అజాగ్రత్త వంటి గుణములను దేవుడు ఇష్టపడరు. ఆఫ్రికా జనుల మధ్య సేవచేస్తూ వచ్చిన డేవిడ్ లివింగ్ స్టన్ ను చూచుటకు స్టాలిన్ అనే ఒక అతను ఒక రోజు వెళ్లారు. పేరుకు క్రైస్తవుడు అయిన స్టాలిన్ కు డేవిడ్ లివింగ్ స్టన్ యొక్క ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం, ముర్క స్వభావం గల ఆ మనుష్యుల మధ్య ఆయన చూపిన ప్రేమ, ప్రయసతో చేస్తున్న సేవ చాలా ఆకట్టుకున్నాయి. అతడు చూపిన దేవుని ప్రేమ స్టాలిన్ ను యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించేలా చేసింది.
నా ప్రియమైన వారలారా! మన మధ్యలో జీవించి, చూపించి క్రీస్తు యొక్క వెలుగును వెలిగించిన ఏమి కార్మిఖేల్, అనైతేరిసా, డా. అయిడా స్కడ్డర్, విలియం కేరి విరినందరిని మన దృష్టిలోనికి తీసుకొని వద్దాం. ఈరోజు మన సేవ, సాక్ష్య జీవితం ఎలా ఉన్నది మనలను సరి చేసు కుందాం. యేసుక్రీస్తు యొక్క వెలుగును లోకానికి చూపించి చీకటిని తొలగించుటకు ప్రార్ధనతో ప్రయాసపడదాం.
- శ్రీమతి. సరోజ మోహన్ దాస్.
ప్రార్థన అంశం:-
వెయ్యి గ్రామాలకు సువార్తను ప్రకటించుటకు అవసరమైన ఆహారం, నివాస స్థలం, వాహనాలు అనే ఇటువంటి ఆవసరతలు సంధింప బడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250