Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.09.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 05-Sep-2021

దిన ధ్యానము(Telugu) 05.09.2021 (Kids Special)

 

అంశం:- గ్రామ మిషనరీ యొక్క చిల్డ్రన్ స్పెషల్

 

"తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను" - 1తిమోతికి 5: 4

 

హాయ్ పిల్లలు ఈ రోజు ఏరోజో తెలుసా ఉపాధ్యాయుల దినోత్సవం. స్కూలుకి వెళ్లకపోవడం వలన మరచి పోయారా? మర్చిపోకూడదు. మీకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులు చాలా ముఖ్యం కదా! వారి కొరకు ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పండి ఒకే నా? 

 

5వ తరగతి పూర్తి అయిన వెంటనే 6వ తరగతికి కొత్తగా వెళ్తున్న విద్యార్థులు అందంగా యూనిఫార్మ్ వేసుకొని కమల టీచర్ ను వెంబడించి చెట్టు క్రిందకు వెళ్లారు. రిజిస్టర్ నుండి పేర్లు చదవ బడుతున్నాయి. కన్న పేరు చదివినప్పుడు తాను రాలేదు ఆబ్సెంట్ మిస్ తాను ఈ రోజు రాలేదు అని విద్యార్థులు అంత చెప్పారు. రమేష్ వెంటనే లేచి నిలబడి కన్న సూపర్ గా చదువుతాడు 5వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు మిస్ అని చెప్పాడు. 3 రోజులు గడిచిన తరువాత తలకు నూనె రాయకుండా మురికి వస్త్రాలతో స్కూల్ కి వచ్చాడు కన్న. ఎప్పుడు చక్కగా డ్రెస్ వేసుకొని నీటిగా వస్తాడే ఇతనికి ఏమైంది అని అందరూ అనుకున్నారు. తరువాత నెలలో జరిగిన పరీక్షలో అన్ని పాఠలలో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. 

 

కమల మిస్ కన్నను పిలిచి ప్రేమగా తనతో మాట్లాడారు. కొన్ని నెలలకు ముందు కాన్సర్ వ్యాధి వలన అమ్మ చనిపోయిన విషయమును ఏడుస్తూనే చెప్పాడు కన్న. కమల టీచర్ తనను ఓదార్చి చదువుకొనుట ప్రోత్సాహం ఇచ్చారు. నీకు పై చదువులకు కావాల్సిన ఖర్చులు అన్నింటిని నేను చూసుకుంటాను అని అన్ని విధములైన సహాయమును కమల టీచర్ చేశారు. అమ్మ చనిపోయిన దుఃఖమును మరచి కన్న చక్కగా చదువుట ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచాయి 10వ తరగతి, ఇంటర్ లో కూడా మంచి మార్కులు సంపాదించి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు. పై చదువుల కొరకు విదేశములకు వెళ్లి అక్కడ కూడ ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. వైద్య విద్య పూర్తి అయిన వెంటనే కళాశాలో ప్రసంస వేదిక ఒకటి ఏర్పాటు చేయబడింది. కన్న తనకు అన్ని విధములుగా సహాయముగా ఉన్న కమల టీచర్ ను ఆ వేడుకకు పిలిచాడు. వయస్సు పైబడిన తల్లి ఆ వేదికకు రావడం అందరూ చూస్తూ ఉన్నారు. కన్న వేగంగా వెళ్లి టీచర్ చేయి పట్టుకొని తీసుకొని వచ్చి ఈమె యొక్క ప్రేరణ, ఉత్సాహమే నన్ను మీ ముందు నిలవబెట్టింది. వీరు నా యొక్క ఉపాధ్యాయులు మాత్రమే కాదు ఈమె నా తల్లి కూడా, నాకు మంచి దారిని చూపిన వారు నా యొక్క ఘనతను కారణం కూడా అని చెప్పిన వెంటనే చప్పట్లుతో ఆ వేదిక అంత కూడా కదిలింది. 

 

ప్రియ తమ్ముడు చెల్లి మీరు కూడా మంచి పిల్లలు వలె క్రమశిక్షణ కలిగిన వారి వలె ఉండుటకు ఉపాధ్యాయులు ముఖ్య కారణం కదా. ఈరోజు మీకు పాఠాలు నేర్పిస్తున్న ఉపాద్యాయులను తలంచి వారి కొరకు ప్రార్ధించుట మీరు మరచి పోకూడదు. ప్రార్థన చేస్తారు కదా వెరిగూడ్. 

- శ్రీమతి. ఎలిజబెత్ వాసు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet