Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.09.2021
Share:

By Village Missionary Movement

Saturday, 04-Sep-2021

దిన ధ్యానము(Telugu) 04.09.2021

 

అంశం:- గురువు దగ్గర నేర్చుకుందాం.

 

"...నాయొద్ద నేర్చుకొనుడి" - మత్తయి 11:29

 

ఉపాధ్యాయుడు ఒకరు తన జీవితంలో పడిన కష్టాలు తమ విద్యార్థులు కూడా పడకూడదని అనుకున్నారు. అందువలన తను నేర్పించగలిగినంతవరకు వారికి పాఠాలను చక్కగా నేర్పించారు. తమ విద్యార్థుల కొరకు అనేకమైన వాటిని త్యాగం చేశారు. విద్యార్థులు ఆయన యొద్ద పట్టుదల, కష్టపడటం, త్యాగం, అన్నింటినీ నేర్చుకున్నారు. జీవితంలో ఉత్తమమైన వాటిని నేర్చుకున్నారు. వారియొక్క జీవితం ఆశీర్వాదకరంగా మారింది. 

 

పరిశుద్ధ గ్రంధంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉత్తమమైన గురువుగా ఉన్నారు. ఆయన తన 31/2 సంవత్సరాలు తన భూ సంబంధమైన విషయంలో శిష్యులను అభివృద్ధి చేశారు, ప్రార్ధించుట నేర్పించారు, సహనం కలిగి ఉండుట నేర్పించారు, విధేయత కలిగి ఉండుట నేర్పించారు. ఇలా యేసుక్రీస్తు తన శిష్యులకు మాత్రమే కాకుండా జీవపు ఊట నేనేయని సమరయ స్త్రీ కి యోహాను సువార్త 4వ అధ్యాయం లో క్రొత్తగా జన్మించే అనుభవం గురించి నికోదేముకు యోహాను సువార్త 3వ అధ్యాయం లో నేర్పించారు. యేసుయొద్ద నేర్చుకున్న ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ప్రకాశిస్తారు.

 

స్నేహితులారా! మనకు ఉపాధ్యాయులు చాలా ప్రాముఖ్యమైన వారు. మంచి జీవితము జీవించుట యేసు యొద్ద నేర్చుకొనుట చాలా ముఖ్యం. జీవిత తత్వాలను, సూచనలను పరిశుద్ధ గ్రంధం ద్వారా నేర్పిస్తారు. క్రొత్తనిబంధనలో మత్తయి సువార్త 5,6,7 అధ్యాయాలను చదివి దాని మూలముగా ఇప్పటికే అనేక అధిపతులు నేర్చుకుంటూ వస్తున్నారు. వారి జీవితంలో ఉన్న తప్పులను సరిచేసుకుంటున్నారు. యేసు అనే గురువు యొద్ద నేర్చుకుందాం. మంచి జీవితమును జీవిద్దాం. 

- కె. శంకర్ రాజ్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఆంగ్లంలో దినధ్యానం అనువాదిస్తున్న హెప్సి అమ్మకు కంటి ఆపరేషన్ జరిగింది. త్వరగా స్వస్థత పొంది అనువాదంనకు సహాయపడే లాగున ప్రార్ధన చేయండి. 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet