Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.09.2021
Share:

By Village Missionary Movement

Friday, 03-Sep-2021

దిన ధ్యానము(Telugu) 03.09.2021

 

అంశం: అత్యుత్తమైన ఉపాధ్యాయుడు.

 

"సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది" - సామెతలు 25:11

 

పెన్సిల్ వెనియాలో గెట్టిస్ బర్గ్ లో ఉన్న సైనిక దళాలలో దేశీయ సమాధి తోట సమర్పణ 1863 వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన జరిగినప్పుడు ఇద్దరు ప్రసిద్ధి గాంచిన బోధకులు బోధించారు. ప్రత్యేక బోధకుడైన ఎడ్వర్డ్ ఎవరేడ్ మునుపటి నిర్మాణ సభ్యుడు. ఆయన కాలంలో శ్రేష్ఠమైన బోధకుడిగా పరిగణించబడిన వారు. శ్రీ ఎవరేడ్ రెండు గంటలు సమయం బోధించారు. ఆయన తరువాత అమెరికా అధిపతి అయిన అబ్రాహాము లింకన్ మాట్లాడారు. అతని బోధన కేవలం 2నిమిషాలు మాత్రమే కొనసాగింది. 

 

గెట్టిస్ బర్గ్ లో లింకన్ బోధించిన బోధ ప్రపంచ మంతా తెలియ జేయబడినదిగాను అనేకుల ద్వారా ఎత్తి చూపించబడినది గాను ఉన్నది. కాని ఎవరేడ్ మాటలు ఇంచుమించు ఎగ్రెసివ్ గా అయిపోయాయి. లింకన్ యొక్క సంసిక్తమైన మరియు అర్ధవంతమైన సామర్ధ్యం తో నిండిన మాటలు దానికి కారణం కాదు. ఆ సమయంలో దేశీయ యుద్ధం ద్వారా మనస్సు పగిలి గాయపడిన స్థితిలో ఉండిన ఆ దేశ ప్రజలకు నమ్మకం అందించేందుకు ఆయన యొక్క మాటలు ఉండుట వలన వారి మనస్సుకు తాకాయి.

 

యెషయా గ్రంధం 50:4 వ వచనంలో అలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నారు అని చదువుతున్నాం. పరిశుద్ద గ్రంధంలో దేవుని ఆత్మ మనకు ఒక అత్యుత్తమమైన బోధకునిగా కనిపిస్తున్నారు. మనం ఏ స్థలంలో ఎలా మాట్లాడాలి ఏ విధముగా నడుచుకోవాలి, ఏవిధంగా బోధించాలి అనే ముఖ్యమైన విషయాలలో ఒక ఉపాధ్యాయునిగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. యోహాను తన సువార్తలలో రాసినప్పుడు పరిశుద్దాత్ముడు మనకు మంచిగా బోధించి నడిపించే వారు అని చెబుతున్నారు. 

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! మన అందరికి ఉపాధ్యాయ నాయకునిగా ఉన్న దేవుని యొక్క పాదముల చెంత వేచియుండి బోధించుట నేర్చుకోవాలి. యేసుని గూర్చి తెలియని వారికి సత్యమును గూర్చి బోధించే అత్యుత్తమమైన ఉపాధ్యాయులుగా మనం మారాలి అని ప్రభువు మన యొద్ద నుండి ఎదురు చూస్తున్నారు. దాని కొరకు ప్రభువు కృప చూపును గాక! ఆమెన్.

- బ్రదర్. పి.జాకబ్ శంకర్

 

ప్రార్థన అంశం:-

200 మంది సువార్త గుంపుల ద్వారా నూతనంగా 1000 గ్రామములలో సువార్త ప్రకటించబడేల ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet