By Village Missionary Movement
Thursday, 02-Sep-2021దిన ధ్యానము(Telugu) 02.09.2021
అంశం: ఘనత పొందుకున్నవారు.
"జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును" - సామెతలు 13:14
రష్యాలో జరిగిన ఒక జర్నలిస్ట్ సమావేశంలో రాష్ట్రపతి అయిన పూడిన్ ను ఒక అతను ఇలా అడిగారు. ఎందుకు మొట్టమొదట డాక్టర్లకు, ఉపాధ్యాయులకు టీకా వెయ్యాలి అని చెబుతున్నారు మిగతా సాధారణమైన మనుష్యుల గురించి చింత లేదా? అని ప్రశ్న అడిగాడు అందుకు వెంటనే పూడిన్ ఒక వైద్యుడు మరణిస్తే ఇంకొక వైద్యుడుకు వచ్చుటకు 30 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చాలా కోట్లా ప్రజా ధనమును ఉపయోగించ వలసి ఉన్నది. ఈరోజుల్లో వైద్యుల యొక్క ఉపయోగం చాలా అవసరం. అదేవిధంగా ఉపాధ్యాయుడు మరణిస్తే వైద్యులను తయారు చేయుట ఎలా?. వైద్యులు, ఉపాధ్యాయులు దేశం యొక్క పెద్ద ఆస్తి. వారిని కాపాడితేనే దేశం యొక్క ప్రజలు క్షేమముగా ఉండ గలరు అన్నారు.
ఉపాధ్యాయులారా పూడిన్ మీ పైన ఎంత గౌరవము చూపిస్తున్నారో. పూడిన్ మాత్రమే కాదు ఈ సమాజమే ఉపాధ్యాయుల మీద గౌరవమును, మర్యాదను చూపిస్తుంది. ప్రతి ఒక్క ఉపాద్యాయుడు విద్యార్థులకు రెండవ తల్లి అని చెబుతారు. ఉపాద్యాయులు దేశ తల రాతను మార్చుతారు. ఎందుకు అనగా వారు కొత్త తరమును తయారు చేస్తారు. విద్యార్థులను విత్తనములు, పొట్టు వలె విడదీసే వారు కాదు ఉపాద్యాయులు. పొట్టను ఎగర వేస్తే పరిపక్వత చెంది జ్ఞానోదయం అనే వెలుగుతో నింపబడతారు. చదువులో ఓడిపోయిన సరే జీవితంలో సాధించి చూపించవచ్చు అనే ప్రేరణను కలుగజేస్తారు. ఉపాధ్యాయులు బోధన అనేక విద్యార్థుల జీవితమును ఉత్సాహ పరిచే దానిగాను, నిలబెట్టే దానిగాను ఉన్నప్పుడు సమాజమునకు దీవెనకరం. ఈ ఉపాద్యాయుని పని పరలోకం నుండి దేవుడు ఇచ్చినది. దానిని ఆయన కొరకు నిజాయితీగా యెహోవా యందలి భయముతో చేసినప్పుడు విద్యార్థుల యొక్క జీవితం పునరుద్ధరించబడి నక్షత్రాలు వలె ప్రకాశిస్తుంది. మీరు మీ పాఠశాలలో లేదా కళశాలలో ఉద్యోగి మాత్రమే కాదు పరలోక ఉద్యోగులు. దేవుడు మీ ద్వారా ప్రతి పిల్లలను అభివృద్ధి చేస్తున్నారు. మీరు మీ భారాన్ని తప్పి పోతే అంటువ్యాధి కాలంలో దేశం యొక్క పరిస్థితి పాడై పోతుంది. ఇటువంటి వ్యాధుల కాలంలో అసౌకర్యాల మధ్యలో మీరు చేసే పని ప్రసంస నియం.
ప్రియమైన వారలారా ! ఏదో స్వల్ప జీవితమునకు ఏదో ఒక చిన్న కంపెనీలో బానిసగా వున్నాను అని అనుకొంటున్నారా? దేవుడు ఉపయోగించే పాత్ర మీరే అని గ్రహించి దేవుని యొద్ద సమర్పించు కొని మనస్ఫూర్తిగా, సంతోషంగా మీరు పనిని చెయ్యండి. దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తారు. మీరు మీ పనియొక్క గౌరవమును తెలుసుకొని ప్రభువు కొరకు మిమ్మల్ని సమర్పించు కొని నడుచుకొనుడి. దేవుడే మిమ్మలను ఆశీర్వదించును గాక! ఆమెన్.
- శ్రీమతి. అన్బు జ్యొతి స్టాలిన్
ప్రార్థన అంశం:-
ఈ. నెల రెండవ మరియు నాల్గవ బుధవారం మొదలుకొని ఆదివారం వరకు జరిగే సువార్త సేవ కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250