Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.09.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 01-Sep-2021

దిన ధ్యానము(Telugu) 01.09.2021

 

అంశం: డబ్బు, అసంతృప్తి మనస్సు, సంతృప్తి.

 

"సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది" - 1తిమోతికి 6:6

 

ధనం కొరత, డబ్బు లేకపోవడం ఇప్పటికి ప్రపంచంలో చాలా పెద్ద సమస్యగా ఉంది. ప్రతి ఒక్కరికి ఉన్న ఆందోళనలో ఇది చాలా పెద్ద ఆందోళనగా చూపబడుతుంది. ముఖ్యముగా ఈ కరోనా రోజుల్లో అనేకులకు సరైన పని లేకపోవడం. సరైన జీతం రాకపోవడం, ధరల పెరుగుదల, ఆవసరతలు పెరుగుదల అనేక కారణములు వలన చాలా దేశములను పరిపాలిస్తూ వస్తున్న ప్రభుత్వమే ఈ రోజుల్లో డబ్బు కొరత అనే ఆందోళలను ఎదుర్కొంటు వస్తున్నది. 

 

పరిశుద్ద గ్రంధంలో ఏలీషా అనే ప్రవక్తను, అతని పైన అనుకోని ఉన్న కుటుంబములను, అతను ఉన్న దేశమును దేవుడు పోషించి, నడిపించిన విధానం మిక్కిలి ఆశ్చర్యకరమైనది. కరువు కాలంలో దేవుడు ఏలీషా ను కెరీతూ వాగు దగ్గరకు వెళ్ల మని చెప్పారు. నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలు కు నేను సెలవిచ్చితిని అన్నారు. 1రాజులు గ్రంధం 17:16 వచనం ద్వారా ఏలీషా మరియు ఆ విధవరాలు కుటుంబం అనేక దినములు పోషించబడ్డారు అని చూస్తున్నాం. ఇంకా ఏలీషా యొక్క ప్రార్ధనను విని దేవుడు దేశంలో వర్షం కురిపించారు. ఏ లోటు లేకుండా చక్కగా నడిపించారు. ఇదే విధముగా పరిశుద్ద గ్రంధంలో అనేక సంభవములు కలవు. 

 

దేవుని పిల్లలారా డబ్బులో కొరత కలుగ వచ్చు కాని మనస్సులో కొరత కలుగకుడదు. ఈ కరోనా కాలంలో దేవుడు మన వి.ఏం.ఏం పరిచర్య క్యాంపస్ లో నివాసం ఉంటున్న సేవకులను పోషిస్తూ, గమనిస్తూ క్రూరమైన వ్యాది నుండి కాపాడుటను గూర్చి నేను కచ్చితంగా చెప్పాలి. స్నేహితులరా మీకు కూడా ధన కొరత పెద్ద సవాలుగా ఉందా? ఎదుర్కొన లేకపోతున్నారా? మీకంటే పేదరికంలో ఉన్న వారిని గూర్చి ఆలోచించండి. దేవుడు ఇంత వరకు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చుట కొరకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఇటువంటి పరిస్థితుల మధ్యలో కూడా పేదరికంలో ఉన్న వారికి సహాయం చెయ్యండి. దేవుడు ఇచ్చే సంతృప్తిని, హృదయంలో సంతోశాన్ని పొందుతారు. దేవుని కృప వలన ఈ భయంకరమైన వ్యాధి కాలంలో సంతృప్తితో, చాలు అనే ఆలోచనతో జీవితమును జీవించుటకు ప్రయాసపడదాం.

- బ్రదర్. టి.శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంత జరిగే సేవలో దేవుని హస్తం తోడై యుండి నడిపించే విధంగా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al