Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.08.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 31-Aug-2021

దిన ధ్యానము(Telugu) 31.08.2021

 

అంశం: సమర్పణ

 

"నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక" - ఆదికాండము 24: 60

 

ఒక సేవకుడు తన విశ్వాసులను చూచుటకు ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబీకులు ఆయనను పిలిచి కూర్చో బెట్టారు. ఆ ఇంటిలో ఉన్న యవ్వన కుమార్తె ఆయన కొరకు టీ తయారు చేసుకొని వచ్చింది. టీ తీసుకున్న సేవకుడు ఆమెను ఈవిధంగా అడిగారు ఏంటమ్మా నిన్ను నీవు సేవకోరకు సమర్పించు కోకూడదా ఆమె వెంటనే ఆశ్చర్యంతో అయ్యా నేను ఇప్పుడు యవ్వనురాలను కళాశాలలో చదువుతున్నాను, ఇంకా ఉద్యోగం, తరువాత పెళ్లి, తరువాత నా కుటుంబం దాని తరువాత నా భవిష్యత్తు అని ఒకదాని తరువాత ఒకటి చెబుతూనే వెళ్ళింది. 60 సంవత్సరాలు వయస్సు వచ్చిన తరువాత నేనే చెయ్య గలిగిన సేవను చేస్తాను అని చెప్పింది. టీని త్రాగుతు వింటున్న సేవకుడు త్రాగుతున్న టీని ఆపేసి సగం ఆమెకు ఇచ్చి దీనిని నువ్వు త్రాగమ్మ అని నవ్వుతూనే అన్నారు. ఆ యవ్వన స్త్రీకి కోపం వచ్చింది. ఆమె కుటుంబీకులకు కూడా అర్థం కాక ఒకరికి ఒకరు చూసుకున్నారు. 

 

ఆ సేవకుడు నవ్వుతూనే ఇలా చెప్పడం మొదలు పెట్టారు. మిగిలిన టీ ని ఇచ్చిన వెంటనే నీకు ఎలా కోపం వచ్చింది నీవు బలము గల నీ జీవితం ఎలా ని కొరకు జీవించి మిగిలిన జీవితము నిన్ను సృష్టించిన ప్రభునకు ఇస్తాను అంటున్నావు అన్నారు. అది విన్న ఆ యవ్వన స్త్రీ ఆలోచించింది కొన్ని రోజులలోనే తనను దేవునికి సమర్పించుకొంది.

 

ఇదే విధంగా పరిశుద్ద గ్రంధంలో ఒక స్త్రీ తనను సమర్పించు కోవడం వలన ఆశీర్వాదం పొందుకుంది. గొప్పవాడైన అబ్రాహాము తన కుమారుడి కొరకు తన మొదటి సేవకుడు స్త్రీని వెదుకుటకు వచ్చినప్పుడు యెహోవా యొద్ద ఒక గుర్తింపును అడిగాడు. ఆ గుర్తింపుతో నీటిని చేదుకొనుటకు వచ్చిన రిబ్కా యొద్ద మాట్లాడాడు. ఆ స్త్రీ మారు మాట్లాడ కుండా ఆయనకు ఆయన యొక్క పది ఒంటెలకు నీళ్లను అందించింది. అది మాత్రమే కాకుండా ఆ సేవకుడ్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తమ ఇంటి వారందరినీ పరిచయం చేసి ఆమె కుటుంబం పూర్తి సమ్మతితో ఇంతవరకు చూడని పెండ్లి కుమారుడికి తనను సమర్పించుకొని ఆ సేవకునితో ప్రయాణం మొదలు పెట్టి సంతృపి గల జీవితమును పొందుకుంది. 

 

దీనిని చదువుతున్న సహోదరి సహోదరులారా! మీ జీవితమును దేవుని చిత్తమునకు సమర్పించుకుంటారా? లేదా మీ హృదయ కోరిక ప్రకారం జీవించి మీ జీవితమును ఇస్తారా? మనలను సంపూర్ణంగా దేవునికి సమర్పించు కొంటె జీవితమే ఆశీర్వాదించ బడుతుంది. ఎదుటి వానికి ప్రయోజన కరమైన జీవితంగా ఉంటుంది. 

- సిస్టర్. ఆర్. మంజుల

 

ప్రార్థన అంశం:-

12 మంది మిషనరీల మూలముగా ఆయా రాష్ర్టాల్లో సమర్పించ బడిన 500 మంది మిషనరీలను దేవుడు దాయచేయు లాగున ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet