By Village Missionary Movement
Monday, 30-Aug-2021దిన ధ్యానము(Telugu) 30.08.2021
అంశం: హార్లిక్స్ క్రైస్తవులు
"మొట్ట మొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి" - అపో.కార్యములు 11: 26
ఒక బోధకుడు తన విశ్వాసి ఇంటికి ప్రతిష్ఠ చేయుటకు వెళ్ళారు. ప్రతిష్ట ప్రార్థన పూర్తి అయిన వెంటనే ఇంటి అన్ని ప్రక్కలను చూపించారు. వంట గదికి వెళ్లిన బోధకుడు అక్కడ ఉన్న హార్లిక్స్ డబ్బాలు చూసి ఆశ్చర్యముతో మీ ఇంటిలో ఉన్న అందరికి హార్లిక్స్ అంటే అంత ఇష్టమా అని అడిగారు. అందుకు అతడు నవ్వుతూ వాటిలో ఒకేఒక దానిలో మాత్రమే హార్లిక్స్ ఉంది. మిగతా అన్నింటిలో పప్పు, పంచదార ఇలాంటివే ఉన్నాయి అన్నారు. దానిని విన్న బోధకుడు చిన్నగా నవ్వుకున్నారు.
అంతియోకియలో ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు అనగా క్రీస్తును వెంబడించే వారు ఆని అర్థం. క్రీస్తును వెంబడించే వారు అనగా క్రీస్తుతో ఉన్న వారు. వారే క్రైస్తవులు అని పిలువబడ్డారు. కాని ప్రస్తుతం ఆ ఇంటిలో ఉన్న హార్లిక్స్ డబ్బాల వలె బయట క్రైస్తవ పేర్లు, క్రైస్తవ ఆలయమునకు వెళ్ళుట అట్టి విధంగా ఉంటేనే క్రైస్తవులు అని పిలువబడుడి పరలోకం వెళ్ళవచ్చు అని ఆలోచిస్తున్నారు. కాని హృదయంలో, జీవితంలో క్రీస్తు లేకపోతే క్రీస్తును అనిదినము వెంబడించక పోతే హార్లిక్స్ క్రైస్తవులే. కాని దేవుడు ఈ నకిలీ జీవితమును కొరరు, మనలను పరలోకం చేర్చుకోరు. క్రీస్తును తండ్రి వలె చూసిన పిల్లలే క్రైస్తవులు. క్రీస్తు లేని క్రైస్తవులు, తండ్రిని తిరస్కరించిన పిల్లలు పరలోకపు తండ్రి మిమ్ములను తిరస్కరిస్తారు అనే దానిని మారువవద్దు.
ప్రియమైన వారలారా! క్రైస్తవులు అని పిలువబడుతున్న మీరు ఎలా ఉన్నారు? తండ్రితో ఉన్న వారి వలె ఉన్నారా? లేదా హార్లిక్స్ క్రైస్తవుల వలె ఉన్నారా? ఆలోచించండి. పరలోకంలో మీరు అంగీకరించబడుట లేదా తిరస్కరించబడుట అనేది మీరు జీవించే జీవితం పై ఆధారపడి ఉన్నది అనే దాన్ని మరచిపోవద్దు. ఈ రోజు క్రీస్తుతో కలసి ఉందాం ఆయననే వెంబడించి పరలోక జీవితమును సొంతం చేసుకుందాం.
- శ్రీమతి అన్బు జ్యోతి స్టాలిన్
ప్రార్థన అంశం:-
అన్ని రాష్ట్రాముల నుండి 12 మంది మిషనరీలను దేవుడు పిలుచుకొని వచ్చుట కొరకు ప్రార్థిద్దాం..
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250