Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.08.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 29-Aug-2021

దిన ధ్యానము(Telugu) 29.08.2021 (Kids Special)

 

గ్రామ మిషనరీ యొక్క చిల్డ్రన్ స్పెషల్

 

"నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది" - కీర్తనలు 119:105

 

7వ తరగతి చదువుతున్న భారతి ని బైబిల్ చదివేల చేయుట అమ్మకు చాలా కఠినముగా ఉండేది. ప్రతిరోజు ఏదో ఒక కారణం చెబుతువుండేది. ప్రతి వారం సండే స్కూల్ కి వెళ్లిన బైబిల్ చదువుటకు తనకు ఉత్సాహమే లేదు. భారతి వాళ్ళ అమ్మ తనతో నువ్వు రెండు రోజులుగా బైబిల్ చదవలేదు వెళ్ళు వెళ్లి బైబిల్ తెరచి చదువు అన్నారు. భారతి మాత్రం అమ్మ మాటకు లోబడలేదు. భారతిని ప్రార్ధించి ఎలా బైబిల్ చదివేలా చెయ్యాలో అమ్మకు అర్థమే కాలేదు. 

 

ఒక రోజు భారతి వాళ్ళ ఇంటికి రినా అంటీ తన చిన్న బాబును, స్నాక్స్ ను తీసుకొని వచ్చారు. భారతికి చిన్న బాబును చూశాక చాలా సంతోషంగా అనిపించి తనతో ఆడుకోవడం మొదలు పెట్టింది. అమ్మ మరియు రినా ఆంటీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుతూ వున్నారు. అప్పుడు అమ్మ మిక్కిలి దుఃఖముతో భారతి లోబడని విషయం గురించి రినా ఆంటీ తో చెప్పారు. రినా అంటీ భారతిని ఎలాగైనా బైబిల్ తెరిచి చదివేలా చెయ్యాలి అని భారతి ఇష్టంగా దాచుకున్న వెండి స్పూన్ తీసి ఆ చిన్న బాబుకు భోజనం తినిపించారు. తరువాత కొంచం సమయం ఉండి ఇంటికి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తరువాత భారతి తన అమ్మ దగ్గరకు వెళ్లి ఎందుకు నా వెండి స్పూన్ తీసి ఇచ్చావు దానిని రినా అంటీ తీసుకొని వెళ్లిపోయార అని ఏడ్చింది. ఆ వారం సండే చర్చ్ కి వెళ్లిన వెంటనే రినా అంటీ దగ్గరకు వెళ్లి ఆంటి నా వెండి స్పూన్ ను చిన్న బాబు తెలియక తీసుకొని వెళ్ళిపోయాడు అది మీ ఇంట్లో ఉందా అని అడిగింది. అందుకు రినా అంటి నేను తీసుకొని రాలేదు అక్కడే నీ బైబిల్లో పెట్టి వచ్చాను. అలా అయితే నువ్వు ఒకవారం పాటు బైబిల్ చదవలేదా అని అన్నారు. భారతికి సిగ్గుగా అనిపించింది. ఎందుకు అంటే అమ్మ ఎన్నిసార్లు చెప్పిన భారతి బైబిల్ తెరవనే తెరవదు. రినా అంటి మళ్ళీ భారతితో చీకటిలో నడవాలి అంటే చూచుటకు టార్చ్ ఎంతో అవసరం అదేవిధంగా చీకటి అయిన ని జీవితం ప్రకాశించుటకు నువ్వు నడవవలసిన మార్గములు నీకు చూపించుటకు బైబిల్ చదువుటయు దానిని కంటస్తం చేయుటకు చాలా అవసరం అన్నారు. భారతి తన తప్పును గ్రహించి సరే అంటి ఇకమీదట ప్రతి రోజు బైబిల్ చదువుతాను అని చెప్పింది.

 

చిన్న తమ్ముడు చెల్లి నువ్వు ఇంత వరకు బైబిల్ తెరవలేదు అంటే ఈ రోజునుండి బైబిల్ తెరచి చదవడం మొదలు పెట్టాలి. ఓకే నా !

- Sis.Beula

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet