Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.08.2021
Share:

By Village Missionary Movement

Saturday, 28-Aug-2021

దిన ధ్యానము(Telugu) 28.08.2021

 

అంశం:- సదా కాలము.

 

"నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును" - మార్కు 13:13

 

అప్పటిలో రుమేనియా ప్రభుత్వం క్రైస్తవులకు అనేక ఇబ్బందులను కలిగించింది. ఆ సమయంలో ఒక చర్చ్ బోధకుడ్ని మరియు ఇద్దరు సంఘ విశ్వాసులను రుమేనియా ప్రభుత్వం ఖైదీలుగా వారిని చెరసాలలో బాధించింది. అక్కడ వారు ఎంత కౄరముగా శ్రమపెట్టలో అంత కౄరముగా శ్రమ పెట్టారు. అయిన గాని బోధకుడు మరియు ఇద్దరు విశ్వాసులు దేవున్ని విడిచి పెట్టలేదు. కాని వారు ఆ శ్రమలో చాలా ఇబ్బంది పడ్డారు. కాని బోధకుడు ప్రసంగించిన ప్రసంగం వారి చెవిలో వినబడుతూనే ఉన్నాయి. అందువలన వారు ఎంతటి శ్రమనైన సహించారు. 

 

ఒక రోజు బోధకుని యొద్దకు అధికారులు వచ్చి ఇంకా మేము నిన్ను ఎలా శ్రమ పెట్టబోతున్నామో అని చెప్పి వివరించారు. ఈ శ్రమను నువ్వు సహించ గలవా? లేదా మేము చెప్పిన పనిని నువ్వు చేస్తావా? మేము చెప్పింది చేస్తే నీకు విడుదల కలుగుతుంది అని చెప్పారు. వెంటనే ఆ బోధకుని మనస్సులో భయం మొదలయ్యింది. వెంటనే ఆయన వారితో సరే మీరు ఏమి చెబితే అదే నేను చేస్తాను అని చెప్పాడు. నీతో వచ్చిన ఇద్దరిని నీవు తుపాకీతో కాల్చాలి అని చెప్పారు. మరుసటి రోజు తనతో పాటు ఖైదీ లైన విశ్వాసులు ఇద్దరిని ఆయన ముందు నిలవబెట్టారు. అతనిని చూసిన విశ్వాసులు అయ్యా మీరు ప్రసంగించిన ప్రసంగమును విని మేము ఇంత శ్రమలోను నిలవబడగలిగాము కాబట్టి మీరు దయచేసి ఆలోచించి చూడండి అన్నారు. అందుకు ఆయన మనస్సు పగిలిపోయింది. సరే మిమ్మల్ని కాల్చిన తరువాత విడుదల పొంది నన్ను నేను సరిచేసుకుంటాను అని చెప్పారు. అందుకు విశ్వాసులు వీరిని నమ్మవద్దు అని చెప్పిన ఆయన నమ్మకుండా వారిని కాల్చి చంపేశారు. ఆ తరువాత నిమిషములోను అధికారులు బోధకుడ్ని కాల్చి చంపేశారు. ఆయన దేవుని యొద్ద తరువాత క్షమాపణ అడగవచ్చు అని ఆలోచించారు కాని దానికి సమయం లేదు ఆయన చనిపోయారు. పరిశుద్ద గ్రంధం చెబుతుంది అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అని.

 

అవును షద్రకు, మిషాకు, అబేద్నెగో ప్రతిమకు మ్రోక్కి తరువాత క్షమాపణ అడగవచ్చు అని వారు తమ యొక్క ఉత్సహాన్ని విడిచిపెట్టలేదు. బదులుగా దేవుని అజ్ఞాను దాటి భూమి మీద సుఖముగా జీవించుట కంటే అగ్ని గుండమునే ఎన్నుకొన్నారు. ఇంకా మనలో ఉన్న పాపములను విడిచిపెట్టమని చెప్పి దేవుడు ఇంకా మనతో మాట్లాడుతూనే ఉండవచ్చు. ఇది నా యొక్క బలహీనత తరువాత నేను దేవున్ని క్షమాపణ అడుగుతాను అని చెప్పి మాటిమాటికి అదే తప్పును చేస్తున్నారా? అలాగైతే దానిని విడిచిపెట్టుటకు ప్రయత్నించండి. ముగింపు అనగా మరణం ఒక మనిషికి ఎప్పుడైనా రావచ్చు. మనకు ఇవ్వబడిన సమయం ఎంత అనేది మనకు తెలియదు. కావున దీనిని మనం ఆలోచనలో పెట్టి ప్రతి రోజు క్రీస్తు కొరకు బ్రతుకుదాం. మనకు వచ్చే శ్రమలలో ఇబ్బందులలో పాప పొరటములలో మనం క్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడదాం. ఆమెన్.

- బ్రదర్. పి.వి.విలియమ్స్

 

ప్రార్థన అంశం:-

న్యూ లైఫ్ హోమ్ లో ఉన్న పిల్లల యొక్క విద్య మరియు భవిష్యత్తు ఆశీర్వదించబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al