Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.08.2021
Share:

By Village Missionary Movement

Friday, 27-Aug-2021

దిన ధ్యానము(Telugu) 27.08.2021

 

అంశం:- చెయ్యి విడువని వాడు, ఎడబయని వాడు.

 

"నిన్ను విడువను నిన్ను ఎడబాయను" - యెహోషువ 1:6

 

వంతెన పైన నడుస్తున్నారు తండ్రి మరియు తన చిన్న కుమార్తె క్రింద నది ప్రవహిస్తుంది. తండ్రి తన కుమార్తెతో ఈ విధంగా చెప్పారు నువ్వు నా చెయ్యి పట్టుకో అప్పుడు నువ్వు పడిపోవు అనగానే కుమార్తె చెప్పింది లేదు నాన్న మీరే నా చెయ్యి పట్టుకోండి అని చెప్పగానే తండ్రికి ఆశ్చర్యం అనిపించింది. దీనిలో ఏమిటి తేడా ఉన్నది నువ్వు పట్టుకొంటే ఏమిటి నేను పట్టుకొంటే ఏమిటి అని తండ్రి అడిగారు. నేను మీ చెయ్యి పట్టుకొంటే ఒకవేళ చెయ్యి విడిచిపెట్టె అవకాశం ఉంది. కాలు జారిన కూడా నేను చెయ్యి విడిచిపెట్టేయొచ్చు కాని మీరు నా చేయ్యి పట్టుకొంటే ఏం జరిగినా సరే మీరు నా చెయ్యి విడువారు అని కుమార్తె చెప్పింది. తండ్రి సంతోషంతో కుమార్తెను ఎత్తుకొని గుండెలకు హత్తుకొని నడిచారు. 

 

పరిశుద్ద గ్రంధంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వెళ్ళడానికి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డ వాడు యెహోషువా అనే దేవుని బిడ్డ. ఇతనిని చూస్తూ యెహోవా చెబుతున్నారు నిన్ను విడువను నిన్ను ఎడబయాను అని అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలకు చివరి వరకు నడిపిస్తూ వెళ్ళుటకు యెహోవా వారిని విడువలేదు, యెడబయలేదు. కారణం ఏమిటి అంటే దేవుడు యెహోషువాను చెయ్యి విడువక పట్టుకున్నారు.

 

అవును ప్రియమైన వారలారా! యేసు క్రీస్తు మన చెయ్యిని గట్టిగా పట్టుకొని నడుస్తున్నారు. మనం మాత్రం అనేక సమయాల్లో ఆయన చేతిని త్రోసివేసి పారిపోతున్నాం. ఏదైనా ఒంటరిగా చేసే ధైర్యం, పొగరు ఉన్నంత వరకు యేసయ్య చెయ్యిని త్రోసివేయడానికి మనం అందరం ప్రయత్నిస్తున్నాం. కాని ఆయన యుగసమాప్తి వరకు మనతో ఉండి మనలను నడిపించాలి అని ఇష్టపడుతున్నారు. అవును ముఖ్యంగా ఈ 7నెలలు మనతో ఉండి మనలను చెయ్యి విడువక ఎడబయాక ఉన్నవారు మన ప్రభువు. చాలా రకముల శోధనలు, ఇబ్బందులు, వ్యాధులు వచ్చినప్పుడు అటువంటి సమయాల్లో కూడా ఆయన మనలను యెడబయక, మన చెయ్యి విడువక ఉన్న ప్రభువు యొక్క చేతిని పట్టుకుందాం. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన మనలను విడువక యెడబయక మనతో ఉండి మనలను నడిపించే శక్తిమంతుడై ఉన్నారు. హల్లెలయా!

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

ప్రార్థన గుడారపు సౌండ్, లైటింగ్ సంబంధించిన వస్తువులు కొనుట కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet