By Village Missionary Movement
Thursday, 26-Aug-2021దిన ధ్యానము(Telugu) 26.08.2021
అంశం:- అలవాటు లేని ఆవు, అలవాటు గల వడిసే.
"ఎఫ్రా యిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించు కొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు" - హోషేయా 11:3
అదినం ఒక ప్రత్యకత గల దినం. ప్రతి కార్యములు కూడా చాలా చక్కగా ప్రణాళిక చేయబడ్డాయి. ఒకరు ఇద్దరు కాదు ఇంచుమించు 30వేల మంది ఎంచుకోబడ్డారు. సకల విధములైన వాయిద్యములతోను, ఆట పాటలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. కొత్త రథం కూడా సిద్ధపరచబడింది. ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటది అవును దావీదు మందసమును యూదా నుండి తీసుకొని వచ్చినప్పుడు చేసిన ఏర్పాటులే ఇవి. నాకొను పొలము యొద్దకు వచ్చినప్పుడు మందసమును మోయుచున్న ఆవులు బెదిరిపోయినప్పుడు మందసమును పట్టుకొనుటకు ఉజ్జా ప్రయతించాడు. దేవుడు అతనిని మొత్తెను గనుక అతడు మరణించేను. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు. అలవాటు గల ఆవులు బెదురుతాయ వాటికి అలవాటు ఉండి ఉంటే అవి బెదిరి ఉండేవి కావు. కొత్తరధము కాబట్టి ఆవులు కూడా కొత్తవి అయి ఉండవచ్చు. అలవాటు గల బండి, ఆవులు ఉండిన యెడల ఉజ్జా యొక్క మరణం జరగక ఉండేది.
మరి యొక సంఘటన దావీదు, గోలియాతు. సౌలు దావీదునకు తన వస్త్రం దరింపజేసీ, తలకు శిరస్త్రణము దరింపజేసీ యుద్ధ కవచమును ఆయనకు దరింపజేశాడు. ఆయన ఖడ్గమును దావీదునకు ఇచ్చాడు. కాని వాటితో దావీదునకు అలవాటు లేనందున వాటిని వదిలేని దావీదు తనకు వాడుక గల వడిసెను తీసుకొని ఐదు గులక రాళ్ళను ఎంచుకొని చిక్కంలో వాటిని వేసి వడిసెను పట్టుకొని ఫిలిష్తీయుని యొద్దకు వెళ్ళాడు, జయం పొందుకున్నాడు. ఈ దినము దేవుడు మన యొద్ద నీతిగల వాక్యంలో అనుభవము గల వారిగా ఉండాలి (హెబ్రీ 5:13) అని కోరుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో శిశువులుగ కాక అనుభవము గల వారిగా ఉండాలి అన్నదే దాని అర్థం. దావీదు కార్యములో ఎలాగు ఆయన తనకు అలవాటు గల విషయాన్ని దేవుని కొరకు వాడుకొన్నాడో అలాగే మనం కూడా మన యొక్క అనుభవములను దేవుని కొరకు, దేవుని నామ మహిమర్థమై వాడుకుందాం, అలా వాడుతున్నప్పుడు దేవుడు సంపూర్ణగా దివిస్తారు.
- సిస్టర్. ఆర్. మంజుల
ప్రార్థన అంశం:-
పార్టనర్ షిప్ మిషనరీలు, పాలిబాగస్టుల మిషనరీల యొక్క సంరక్షణ మరియు వాళ్ళ యొక్క ఆవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250