By Village Missionary Movement
Wednesday, 25-Aug-2021దిన ధ్యానము(Telugu) 25.08.2021
అంశం:- తొందరపడవద్దు.
"యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులుగలవాడు కుటిలచిత్తుడు." - సామెతలు 14: 2
లండన్ లో నిజాయితీ గల పారిశ్రామికవేత్త కలరు. ఒక రోజు పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తల మధ్యలో ప్రపంచ సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ పారిశ్రామిక వేత్తలు ద్వారా అకర్షితులైన పెట్టుబడి దారులు వారి పరిశ్రమలో పెట్టుబడి పెట్టె అవకాశం ఉండేది. అకస్మాత్తుగా అతనికి అనారోగ్యం కలుగుట వలన ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ సమావేశానికి తన కుమారుడ్ని ప్రతినిధిగా పంపించాలి అనుకున్నారు. కుమారునికి అనుభవం లేనందున ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి అనేది నేర్పించాలి అని ఒక చిన్న చేతి గడియారమును వాడికి ఇచ్చి కుమారుడా ఇది ఒక వింత గడియారం నిదగ్గర ఎవరైనా మాట్లాడి నప్పుడు ఈ గడియారం నీకు ప్రతి ధ్వనిని ఇచ్చినట్లులయితే నీవు మాట్లాడుతున్న వ్యక్తి యొద్ద నిదానంగా, జాగ్రత్తగా మాట్లాడు అని సలహా చెప్పాడు.
నిర్దిష్ట రోజులో ఆ కుమారుడు ఆ సమావేశమునకు వెళ్ళాడు. పారిశ్రామిక వేత్త ఒకరు అతనిని పొగిడారు వెంటనే చేతికి ఉన్న గడియారం వైబ్రేషన్ ఇచ్చింది. వెంటనే అలా ఏం లేదు ఇంకా ఎంతగానో పనిచెయ్యాలి అని చెప్పాడు కుమారుడు. ప్రక్కన ఉన్న మరొక వ్యక్తి వచ్చి మీ నాన్న తక్కువ నాణ్యత గల వస్తువులను అమ్మకం చేస్తున్నారు అని అమర్యాదగా మాట్లాడారు. మరల ఆ గడియారం వైబ్రేషన్ ఇచ్చింది. అప్పడు ఆ కుమారుడు మా గురించి మీ యొద్ద తప్పుడు ఆలోచన ఉన్నది అని చెప్పి అక్కడ నుండి వెళ్లి పోయాడు.
ఇలా ప్రతి ఒక్కరినీ ఎదుర్కొంటు సవేశమును పూర్తి చేసి ఇంటికి వచ్చి నాన్న దగ్గర జరిగిన విషయాన్ని చెప్పాడు. ఎవరి యొద్ద అయిన ఎటువంటి పరిస్థితుల్లో అయిన నిదానంగా మాట్లాడి జ్ఞానంగా నడుచుకొంటె ఎటువంటి సమస్యలైన ఎదుర్కొనగలం. ఇక మీదట నా బావోద్వేగమును బట్టి వైబ్రేషన్ ఇస్తున్న ఈ గడియారం నాకు అవసరం లేదు. నేను ఎలా నిదానంగా నడుచుకోవాలి అనేది నేర్చుకున్నాను అన్నాడు కుమారుడు.
మోషే భూమి మీద వున్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడై యున్నాడు. కాని ఇశ్రాయేలీయులు మాటలతో కోపం తెప్పించి నప్పుడు బండను చూసి మాట్లాడుటకు బదులుగా ఆ బండను కొట్టడం వలన దేవునికి కోపం వచ్చింది. ఇందువలన కానానుకు వెళ్ళవలసిన వాగ్దానమును నెరవేర్చ వలసిన అతను కోపం వలన దానిని కనులతో మాత్రమే చూడ గలిగాడు. యెహోవాను ముఖాముఖిగా చూడగలిగిన మోషేకు ఇటువంటి పరిస్తితి అయితే మరి నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి.
అవును మనం కూడా అనేక పనులలో ప్రక్కవాడి మాటల వలన, క్రియల వలన గాయపడే సమయాల్లో మనస్సు కృంగి నిదానమును కోల్పోయే పని చేసి గాయపడి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాము. అందువలన యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచు కుందాం.
- శ్రీమతి. వసంతి రాజా మోహన్
ప్రార్థన అంశం:-
ప్రార్థన గుడారపు పనులలో ఉన్న ఆటంకములు మారి త్వరగా కట్టి పూర్తి చేయుటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250