By Village Missionary Movement
Tuesday, 24-Aug-2021దిన ధ్యానము(Telugu) 24.08.2021
అంశం:- తేనెతో కలిపిన అపూపము.
"ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను" - నిర్గమకాండము 16: 31
తియ్యని వంటలు అంటే అందరికి ఇష్టమే. ఇంట్లో తీపి వంటలు చేస్తున్నప్పుడు పిల్లల నుండి పెద్దవారు వరకు అందరూ ఇష్టపడతారు. పొంగడాలు అంటే అందరికి ఇష్టమే. పొంగడాలు చేస్తున్నప్పుడు వాటిని తినేసి మరిలేవా అని అడిగే వారు కూడ కలరు. అంతగా వాటి యొక్క రుచి ఉంటుంది. రుచి అలా ఉండుట వలన అన్ని వయస్సుల గలవారు కూడా తింటారు. తేనెతో కలిపిన పొంగడాలు అంటే మీరు ఆ రుచిని ఆలోచించ గలుగు తున్నారా?
పరిశుద్ద గ్రంధమైన బైబిల్లో పాతనిబంధలో గల నిర్గమకాండం 16 వ అధ్యాయంలో ఇశ్రాయేలు వంశపు వాళ్లకు దేవుడు మన్న అనే ఒక ఆహారము దయచేసిన దానిని చూస్తున్నాం. దాని యొక్క రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉంటుంది అని చదువుతున్నాం. వారు ఉదయాన్నే లేచి దానిని వారికి అవసరమైనంతగా సమకూర్చుకొనేవారు. అది వాళ్లకు మిక్కిలి రుచి కలిగినదిగా ఉండేది. మరియు ఆ కార్యం జరిగినందు వలన ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుని ప్రేమను, ఆయన కనికరాన్ని మిక్కిలిగా గ్రహించుకొన్నారు.
స్నేహితులరా! ఈ దిన జీవితం అనేకులకు చేదుగా అనిపిస్తుంది కారణము అన్నింటిలోను తొందరపాటు, అన్ని వెంట వెంటనే జరిగి పోవాలి అనే ఆలోచన వాటివలన అనేక సమయాల్లో నిరుత్సాహం, అందువలన మన జీవితం రుచి లేనిదిగా మారిపోతుంది. మన జీవితాన్ని రుచి కలిగించినదిగా మార్చగలిగిన మన్న దేవుని వాక్యమే. దానిని మనము సమయం తీసుకొని చదివి ధ్యానించడం తెలుసుకోవాలి. ఈ అలవాటు మన ఆలోచన, తలంపు కార్యములను అన్నింటిని నూతన పరుస్తుంది. దేవుని వాక్యమే మన జీవితంలో రుచిని ఇవ్వగలదు. అవి తేనె కంటెను, జుంటే తేనె దారలు కంటెను మధుతమైనది (కీర్తనలు 19:10). దీనిని మనం వెతకాలి, ఆశించాలి. ఇలా ఆశతో బైబిల్ ను చేతుల్లోకి తీసుకోనండి, ధ్యానించండి, దాని ప్రకారం జీవించండి అది ఇంపైనదిగా ఉంటుంది.
- బ్రదర్. టి. శంకర్ రాజ్
ప్రార్థన అంశం:-
మీడియా పరిచర్యలో పరిచర్య చేస్తున్న సేవకులను దేవుడు జ్ఞానంతో నింపి వాడుకొనేటట్లు ప్రార్దిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250