By Village Missionary Movement
Monday, 23-Aug-2021దిన ధ్యానము(Telugu) 23.08.2021
అంశం: కారణాలు.
"పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు" - సామెతలు 18:9
కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి కాయలు దొంగిలించుటకు వెళ్లిన వాడిని తోటమాలి చూసేసారు. ఎందుకు కొబ్బరి చెట్టు ఎక్కేవు అని అడిగాడు తోటమాలి. అందుకు ఆ దొంగ గడ్డికోయడానికి ఎక్కేను అన్నాడు. కొబ్బరి చెట్టు పైన ఎలా గడ్డి ఉంటుంది అని అడిగాడు తోటమాలి. గడ్డి లేదు కాబట్టి దిగుతున్నాను అని సమాధానం చెప్పాడు దొంగ. ఏదైనా చెప్పి తప్పించుకునే వారు అనేకులు. తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన విద్యార్ధిని ఎందుకు లేటు అని అడిగారు ఉపాధ్యాయుడు. అందుకు ఆ విద్యార్ధి కొంచం లేటు అయింది సర్ అని సమాధానం చెప్పాడు. ఇది వినుటకు నవ్వులాటగా వున్నాను మనము అనేకసార్లు మన పనులకు కారణములు చెబుతుంటాం. మనలను నమ్మి ఒక పని లేదా ఒక బాధ్యత మనకు ఇవ్వబడినప్పుడు అది సరిగా చెయ్యలేక కారణములు చెప్పి తప్పించు కొంటున్నాం. కారణములు ఎందుకు చెబుతున్నాం?
1. నిజానికి ఆ పని మీద ఆశక్తి లేకపోవటంతో,
2. చెయ్యవలసిన పనిని చెయ్యకుండా వేరే పనులలో అధికముగా సమయం చెల్లించడం.
3. పూర్తిగా ఆ పనిలో ప్రమేయం లేకపోవడం.
4. ఎవరైనా అడిగితే చెప్పు కోవచ్చులే అనే ఆలోచన.
ఎటువంటి కారణములు వలన ఆ పనిని పూర్తి చెయ్యలేనప్పుడు పనిని అప్పగించిన వారు మన మీద ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం. మరల ఆ నమ్మకమును పొందుకొనుటకు అంత సులువు కాదు. పరిశుద్ద గ్రంధంలో నోవాహు అట్లచేసేను. దేవుడు అతనికి ఆజ్ఞపించిన ప్రకారము యావత్తును చేసెను అని అదికాండం 6:22 వ వచనములో వ్రాయబడి ఉంది. నోవాహు పని పూర్తి అవ్వడం వలన తన కుటుంబీకులు మరియు అనేక ప్రాణులు కాపడబడ్డాయి.
మన జీవితంలో మనం జయం పొందుకొని దాని ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మేలులు, ఆశీర్వాదములు వాటంతట అవే రావడం లేదు. కారణములు చెప్పకుండా పనిని నెరవేర్చినప్పుడు మనం హెచ్చింపబడతాం, ఆధిపత్యంతో జీవిస్తాం, అనేకులకు ఆశీర్వాదంగా బ్రతుకుతాం. హల్లెలయా!
- బ్రదర్. ఎల్. అలగర్ సామి
ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణం, దిన ధ్యాన పత్రికలు ప్రింటింగ్ చేయుటకు కావాల్సిన ఆవసరతలు సందించబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250