By Village Missionary Movement
Sunday, 22-Aug-2021దిన ధ్యానము(Telugu) 22.08.2021 (Kids Special)
"దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు" - 1యోహాను 4:8
చీకుబుకు చీకుబుకు కుకు అంటూ కుస్తూనే ట్రైన్ వేగంగా బయలుదేరింది. ఏంటి పిల్లలు మీకు ట్రైన్ అని చెప్పిన వెంటనే మీకు ట్రైన్ లో జాలిగా ప్రయాణం చెయ్యాలి అని ఆశగా ఉందా? అవును మీలాగే ఆలిస్ అనే చిన్న పాపకు చాలా ఆశగా ఉండేది. తన ఆశను వాళ్ళ అమ్మతో చెప్పింది. ఒక రోజు ఆలిస్ వాళ్ళ అమ్మతో కలిసి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి ట్రైన్ లో వెళ్లారు. ఆలిస్ కు చాలా సంతోషం కిటికీ ప్రక్కనే కూర్చొని ప్రకృతిని చూస్తూ సంతోషంగా వెళ్ళింది. వారు దిగ వలసిన ప్రాంతం వచ్చింది ట్రైన్ దిగగానే చలి కాలం కావడంతో స్వేటర్ వేసుకొని అమ్మ చెయ్యి పట్టుకొని బయటకు వెళ్లుటకు గేటు వైపు వెళ్తూవుంది. అప్పుడు ఒక ముసలాయన ఆకలి వేస్తుంది ఏదైనా ఇవ్వండి అని ట్రైన్ దిగిన అందరిని అడుగుతువున్నాడు. అతనిని చూడగానే ఆలిస్ మనసు పగిలిపోయింది. తన తాతయ్య జ్ఞాపకం వచ్చారు. ఇతను మన తాతయ్య లాంటి ఒక తాతయ్యే కదా అని అనుకోని తన అమ్మ యొద్ద డబ్బులు తీసుకొని ఆ ముసలి వాని యొద్దకు వెళ్ళి దయగల మాటలతో తాతయ్య తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆయనను ప్రేమతో చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయింది.
తరువాత ఆలిస్ మరియు అమ్మ అ స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎవరో వారిని వెంబడిస్తున్నట్లు గ్రహించి ఇద్దరు వెనుదిరిగి చూస్తే అదే ముసలివాడు. వెంటనే అమ్మ నీకు ఏం కావాలి ఎందుకు మిమల్ని వెంబడిస్తు వచ్చావు అని అడిగింది. అమ్మ ఇంతవరకు ఎవరు నన్ను తాతయ్య అని పిలవలేదు మీ పాప నన్ను తాత అని పిలిచింది ప్రేమ కొరకు వాంఛ కలిగిన నాలో ఒక కొత్త సంబందం వచ్చినట్లు అనిపించింది. అందువలన మళ్ళి ఒక సారి తాత అని పిలవమని చెప్పండమ్మ అని కన్నీటితో చెప్పాడు. అతని కన్నీటిని చూసిన ఆలిస్ తాత, తాత అని ప్రేమతో పిలిచింది. తరువాత తన అమ్మమ్మ ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టి యేసయ్య యొక్క ప్రేమను వివరించి చెప్పింది.
ప్రియమైన తమ్ముడు, చెల్లి ఆలిస్ యొక్క ప్రేమ గల గుణాన్ని చూసారా? ఒక భిక్షగాడు అని చూడకుండా ప్రేమతో తాత అని పిలిచి మాట్లాడింది. తన వలె నువ్వు పెద్దవారిని, పేద వారిని, కష్ట పడేవారని అల్పముగా చూడకూడదు. వారిని ప్రేమతో చూడాలి నువ్వు అలా చూస్తే యేసయ్య నిన్ను చూసి చాలా సంతోష పడతారు. ఓకేనా.
- శ్రీమతి. సారా శుభాస్
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250