Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.08.2021
Share:

By Village Missionary Movement

Saturday, 21-Aug-2021

దిన ధ్యానము(Telugu) 21.08.2021

 

స్వభావం మారకుండా ఉందాం.

 

"ఈ లోక మర్యాదను అనుసరింపక" - రోమీయులకు 12:2

 

ఒక ఉపాధ్యాయుడు తన చేతిలో 500రూపాయల కాగితంతో తరగతి గదిలోకి వెళ్లారు. విద్యార్థులకు దానిని చూపించి ఇది ఏమిటి అని అడిగారు దానికి అందరూ 500 రూపాయల కాగితం అని చెప్పారు. ఉపాద్యాయుడు దానిని చేతితో నిలిపివేసి ఇది ఏమిటి అని అడిగాడు. విద్యార్థులు అది 500 రూపాయల కాగితం అన్నారు. మరల దానిని చెత్త కుప్పలో వేసి ఇది ఏమిటి అన్నారు. దానికి కూడా విద్యార్థులు 500 రూపాయలు అన్నారు. రాజా పరిగెత్తుకొని వెళ్ళి చెత్త కుప్పలో ఉన్న డబ్బుని తీసుకొని ఉపాధ్యాయునికి ఇచ్చాడు. ఉపాధ్యాయుడు దానిని తీసుకొని నేరుగా చాపి నలిగిపోయిన భాగంలో చేతులతో తుడిచి ఇప్పుడు ఇది కూడా 500 రూపాయల కాగితమే. ఇది చెత్త కుప్పలో ఉన్న మన చేతిలో ఉన్న ఎలా దాని విలువ మారలేదో అదేవిధంగా విద్యార్థులైన మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న సరే మీ యొక మంచి తనాన్ని విడిచిపెట్ట కూడదు అని చెప్పారు. 

 

యోసేపు తన తండ్రికి ప్రియమైన కుమారుని వలె తన కుటుంబంతో ఉన్నప్పుడు వారితొ ప్రేమగా ఉన్నాడు. తన కలను చెప్పినప్పుడు అతని సహోదరులు అతనిని ద్వెశించి గుంటలో త్రోసివేసినప్పుడు ఇస్మాయేలియులకు బానిసగా వానిని అమ్మి వేసినప్పుడు యోధుడుగా ఉన్నాడు. ఇంకా చెయ్యని తప్పుకు చెరసాలలో బందించ బడినప్పుడు తనతో పాటు చెరసాలలో బందించబడిన వారితో ప్రేమగా మాట్లాడిన వాని వలె ఉన్నాడు. అ దేశంలో ప్రధానమంత్రిగా హెచ్చింప బడినప్పుడు తన సహోదరులును క్షమించి ప్రేమ చూపించిన వాని వలె ఉన్నాడు. తండ్రి చనిపోయినప్పుడు సహోదరులు బయపడినప్పుడు కూడా ప్రేమ కలిగిన వాని వలె ఉన్నాడు. తన కష్టాల్లో, బాధల్లో కూడా సహోదరులు పైన పగబట్టలేదు ద్వెషించలేదు. తన చుట్టువున్నవారు ఎలా నడిచిన తన స్వభావ స్థితి మారకుండా ప్రేమ చూపించే వాని వలె ఉన్నాడు. 

 

ప్రియమైన వారలారా! మన గురించి ఏమిటి? మనం ఎదుర్కొనే అన్ని పరిస్థితుల్లోను, శోధనలోను మన స్వభావం మారకుండా, దర్మం మారకుండా ఉంటున్నామా లేదా కష్టాలలో, శోధనల్లో సణుగు కొనేవారిగా ఉంటున్నమా? అలోచిద్దాం. యోసేపు వలె మన స్వభావం మారకుండా, మంచి తనం మారకుండా అన్ని పరిస్థితుల్లో ఎక్కడైన ఉండుటకు నిర్ణయించుకొందాం. 

- బ్రదర్. గోపి దివాకర్

 

ప్రార్థన అంశం:-

ప్రతి రోజు దిన ధ్యాన వార్తలను వ్రాసి ఇస్తున్న దేవుని పిల్లలను దేవుడు తన అభిషేకంతో నింపేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al