Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.08.2021
Share:

By Village Missionary Movement

Friday, 20-Aug-2021

దిన ధ్యానము(Telugu) 20.08.2021

 

అంశం:- క్షమాపణ

 

"మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును" - మత్తయి 6: 14

 

స్కాట్లాండ్ దేశానికి చెందిన చిన్న అబ్బాయి రాబర్ట్ తనతో కలిసి చదువుతున్న జాకబ్ తో గొడవపడి క్రిందకు త్రోసివేయడం వలన జాకబ్ చనిపోయాడు. ఈ నేరము వలన చిన్న వాడైన రాబర్ట్ 7 సంవత్సరాలు చిన్న పిల్లల సంస్కరణ పాఠశాలలో చదువుకొనుటకు చెరసాలకు పంపబడ్డాడు. చెరసాలకు వెళ్ళే ముందు జాకబ్ యొక్క తల్లి రాబర్ట్ ను కలిసి నా కుమారుడు యొక్క మరణమునకు నువ్వు కారణము అయ్యావు కాని నేను నిన్ను క్షమిస్తాను నిన్ను నేను నా కుమారుని వలె చూసుకుంటాను, నీ తొడ బుట్టిన వారు కూడా నాకు పిల్లలు వంటి వారే. నాకు ఒకే ఒక కుమారుడు అయిన జాకబ్ ను మరల ఈ లోకంలో చూడలేను. అందువలన నిన్ను నీ తొడబుట్టిన వారిని నా పిల్లలు వలె చేర్చుకుంటాను అని కన్నీటితో చెప్పారు. రాబర్ట్ మరియు అతని కుటుంబీకులు జాకబ్ యొక్క తల్లిని హత్తుకొని ఏడ్చారు. 

 

పరిశుద్ద గ్రంధంలో తమ చిన్న సహోదరుడు అయిన యోసేపును తన యొక్క సహోదరులు కొట్టి గుంటలో పడద్రోసి ఐగుప్తుకు బానిసగా అమ్మివేశారు. కాని తరువాత రోజుల్లో యోసేపు ఆశీర్వదించబడినప్పుడు తన సహోదరులు మీద పగ తీర్చుకోకుండా బయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేను అని అదికాండం 50:21లో మనం చదువుతున్నాం. 

 

ప్రియమైన స్నేహితులరా! మన యొక్క జీవితంలో ఇతరులు చేసిన తప్పు వలన మనం బాధింపబడి శ్రమలు అనుభవిస్తూ ఉండవచ్చు. మనం వారిని దేవుని ప్రేమతో క్షమిస్తేనే వారిమీద ఉన్న చేదు, సణుగులాట, పౌరుషం మారుతాయి. ఇది అంత సులభం కాదు కాని మనం వారిని క్షమించని పరిస్థితుల్లో దేవుడు కూడా మనలను క్షమించరు. యోసేపు వలె క్షమిద్దాం, దేవుడు మన ద్వారా అనేకులను పోషిస్తారు. మనలను తన సేవలో ఉపయోగించుకొంటారు. ఆమెన్.

- బ్రదర్. టి.శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం:-

నంబికై టి.వి లో వస్తున్న దేవుని మాటలను చూస్తున్న అన్యజనులు దేవుని యొక్క ప్రేమను తెలుసుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio royalbet betpas giriş milanobet bahiscasino betpas bahiscasino atlasbet romabet giriş holiganbet giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom romabet betpas