Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.08.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 17-Aug-2021

దిన ధ్యానము(Telugu) 17.08.2021

 

అంశం:- తప్పించే హస్తం.

 

"నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును" - యిర్మియా 33:3

 

రిచర్డ్ ఉమ్రాన్డ్ అనే యూదుడు క్రీస్తును నమ్ముకొనుట వలన కమ్యూనిస్టు జైలులో బందించబడి 12 సంవత్సరాలు మిక్కిలి భయంకరమైన పద్దతిలో పీడించబడి ఆయన దేవుని మీద ఉంచిన నమ్మకమును తిరస్కరించుటకు బలవంతం చేయబడ్డాడు. కాని ఆయన విడుదల అయిన వరకు దేవున్ని తిరస్కరించలేదు. ఆయన రాసిన 'దా ఆర్డర్స్ ఆఫ్ గాడ్' అనే పుస్తకంలో జైలులో భయంకరమైన పరిస్థితుల్లో నిశబ్దంతో సమాధానంతో ఎలా అతను వుండగలిగాడు అనేది ఒక చిన్న కథ ద్వారా వివరించి రాసారు.

 

ఒక ఓడలో నావికుడితో ఓటు తన భార్య కూడా ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు అక్కడ ఏర్పడిన తుఫాను వలన ఓడ అటుఇటు ఊగడం ప్రారంభమైంది. అప్పుడు ఆ నావికుని భార్య తన యొద్ద ఈ విధముగా ఓడ ఊగుతూ తడబడుతున్నపుడు మీరు ఎలా నిశ్శబ్దంగా వుండగలుగుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ నావికుడు సమీపంలో ఉన్న ఒక కత్తి తీసి తన భార్య యొక్క మెడ దగ్గర పెట్టారు. భార్య మాత్రం ఆందోళన చెందకుండా చూస్తుంది. అతను ఇప్పుడు నువ్వు ఎలా నిశ్శబ్దంగా బయపడకుండా ఉన్నావు అని అడిగారు. దానికి ఆమె ఎందుకు నేను బయపడాలి ఈ కత్తి నా ప్రియమైన భర్త చేతుల్లో ఉంది కదా మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు నన్ను కచ్చితంగా పొడవరు అని నాకు తెలుసు అని చెప్పింది. 

 

అప్పుడు ఆ నావికుడు అదే నేను కూడా నిశ్శబ్దంగా ఉండుటకు కారణం. ఈ అలలు, గందరగోళం ఇవన్నీ నా తండ్రి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయనకు ఈ అలలు లోబడతాయి కనుక బయపడకుండా ఉన్నాను అని చెప్పారు. 

 

ప్రియమైన వారలారా! మీ జీవితంలో తుఫాను, గాలులు విస్తునే ఉన్నాయా? ఏం చెయ్యాలి అని తెలియక ఆందోళన చెందుతున్నారా? ఎక్కడకు వెళ్ళాలి అని తెలియక తడబడుతూనే ఉన్నారా? మనకు ఒక దేవుడు ఉన్నారు. ఆయన గాలిని సముద్రాన్ని గద్దించి నిశ్శబ్దంగా ఉండు అని ఆజ్ఞపించి తుఫానును నిమ్మల పరుస్తారు. ఆయన మీ జీవితంలో ఏర్పడే తుఫానును, అలలను, గాలులను నిమ్మల పరిచే శక్తి మంతుడు. కలత చెందవద్దు, అలసిపోవద్దు నాకు మొఱ్ఱ పెట్టుము అని చెప్పిన దేవుడు ఎల్లప్పుడూ మార్పు లేని వానిగానే ఉన్నారు. అదేవిధంగా మనలను తప్పించే సర్వ శక్తి మంతుడై ఉన్నారు. ఆమెన్.

- శ్రీమతి. జీవా విజయ్

 

ప్రార్థన అంశం:-

సాతాను వలన, వ్యాధుల వలన బంధింపబడిన జనులకు హీలింగ్ సర్వీస్ జరుగుటకు దాని ద్వారా అనేకులు విడుదల పొందుట కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al