Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.08.2021
Share:

By Village Missionary Movement

Monday, 16-Aug-2021

దిన ధ్యానము(Telugu) 16.08.2021

 

పక్షి రాజుకు సమానమై:

 

"యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు" - యెషయా 40: 31

 

పక్షులలో పక్షిరాజు అయిన డేగ కథ మిక్కిలి ఆశక్తి కరమైనది. చాలా ఎక్కువ రోజులు బ్రతికే పక్షులు అంటే ఇవే. ఇవి 70 సంవత్సరాలు బ్రతకగలవు. కాని ఆ 70 సంవత్సరాలు చేరుకున్న అవి కొన్ని అత్యంత కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళవలసి ఉంది. పక్షి రాజు తన 40వ సంవత్సరమునకు చేరినప్పుడు వాటి గోళ్లు ద్వారా ఎరను వేటాడి తీసుకొని వెళ్లలేవు. వాటి పొడవైన, పదునైన ముక్కు వంగిపోతుంది. వయస్సు అయినందున వాటి యొక్క భారీ రెక్కలు వాటి గుండెకు అంటుకొనుట వలన అవి ఎగురుటకు అసాధ్యం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో వాటికి రెండే దారులు మిగిలి ఉన్నాయి. ఒకటి అలాగే ఉండి చనిపోవడం లేదా 150 రోజులు అత్యంత కఠినమైన దినముల జీవితమును దాటి వెళ్ళడం. దాని కొరకు ఆ పక్షులు పర్వతం ఎగువున అవి కట్టుకున్న నివాస స్థలములకు వెళ్ళి ఉంటాయి. వాటి యొక్క పాత ముక్కుతో రాళ్ళను పొడిచి పొడిచి రెక్కలను తీసేసుకొని వాటికి కొత్త రెక్కలు వచ్చేవరకు వేచి ఉంటాయి. 

 

పరిశుద్ద గ్రంధంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని వ్రాయబడి ఉన్నది. ఈ పక్షి రాజు వలె మనము రెక్కలు చాపి ఎగరాలి అంటే వేచి ఉండాలి. పక్షి రాజు వలె మనము బ్రతుకుట నేర్చుకోవాలి. 

 

దీనిని చదువుతున్న దేవుని పిల్లలారా! కొన్ని సమయాలలో మార్పులు మనకు అవసరం. కొన్ని సమయాల్లో మనం పునరుజ్జీవం పొంది జీవించుటకు కొన్ని మార్పులు చేయవలసి ఉంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనం బ్రతుకుటకు చాలా కచ్చితమైన. మార్పు మాస్క్. కావున పాత జీవితపు అలవాట్లు, పాత మూఢనమ్మకాలు ఇంకా చాలా వదులు కోవలసి ఉన్నది. అదనంగా నెలలు తరబడి ఉండవలసిన ఈ రోజులు పక్షి రాజు వలె మనలను నూతన పరిచే రోజుల్లా యెహోవా కొరకు ఎదురు చూసే రోజుల్లా మార్చుకుందాం. అప్పుడు పక్షి రాజుతో సమానంగా ఎగురుతు లోకాన్ని జయించగలం. ఆమెన్.

- బ్రదర్. టి. శంకర్ రాజ్

 

ప్రార్థన అంశం :-

ఒక గ్రామమునకు 2000/- రూపాయలు ఇచ్చి దత్తతు తీసుకొనే కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al