By Village Missionary Movement
Sunday, 15-Aug-2021దిన ధ్యానము(Telugu) 15.08.2021 (Kids Special)
అంశం: విడుదల విడుదల.
"కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు" - యోహాను 8: 36
హాలో పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము స్పెషల్ ఏంటో తెలుసా? అవును ఈ దినము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినం. ప్రతి సంవత్సరం ఈ దినము మనం అందరం స్కూల్ కి వెళ్ళి జెండా ఎగురవేసి మార్చింగ్ చేస్తూ ఉంటాం. స్వీట్స్, చాక్లెట్స్ అందరికి పంచి పెడుతూ ఉంటాం. కాని గడిచిన రెండు నెలలుగా స్కూల్ కి వెళ్ళలేదు కదా.
75 సంవత్సరాలకు మునుపు మన పూర్వీకులు పోరాడి బ్రిటిష్ వారి పాలనలో నుండి మన దేశాన్ని విడిపించారు. యేసయ్య కూడా మన పాపముల నుండి మనలను విడిపించారు. ఈ రోజుల్లో అనేకులు వీడియో గేమ్స్, సోషల్ మీడియాకు బానిసలు అయిపోయారా? చింతించకండి యేసయ్య కచ్చితంగా దాంట్లో నుండి విడుదల ఇస్తారు. బైబిల్ చెబుతుంది కుమారుడు మిమ్మల్ని విమోచించిన యెడల కచ్చితంగా విమోచింప బడతారు. అది మాత్రమే కాదు ఈ దినాల్లో మీరు ఎక్కువగా కోపపడుతున్నారా? ఎవరినైనా చూసి అసూయ పడుతున్నారా? కచ్చితంగా దాంట్లో నుండి కూడా యేసయ్య విడుదల ఇస్తారు. ఎలా విడుదల ఇస్తారు అని అడుగుతున్నారా? ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుతున్నామో అప్పడు కచ్చితంగా యేసయ్య విమోచిస్తారు. మనం యేసయ్య దగ్గరకు వెళ్లి పొందుకున్న విడుదలను ఇతరులకు చెప్పి వాళ్ళు కూడా విడుదల పొందేటట్లు ప్రార్ధించాలి. అది మాత్రమే కాదు అబద్దం అడకూడదు, దొంగలించ కూడదు, ఎవరిని మోసం చెయ్యకూడదు. అమ్మ నాన్నలకు లోబడి నడుచుకోవాలి. స్కూల్లో టీచర్లు ఇచ్చే హోమ్ వర్క్ ని సరిగా చేసి ముగించాలి. ఎవరైనా ఏదైనా పనిని అప్పగిస్తే బాధ్యతతో పూర్తి చెయ్యాలి. ప్రతి రోజు తప్పకుండా ప్రార్థన చెయ్యాలి, బైబిల్ చదవాలి. ఇలా చేస్తే మనం యేసయ్యకు ప్రియముగా జీవించగలము. యేసయ్య కు ప్రియముగా జీవిస్తే యేసయ్య మన కుటుంబాన్ని దీవిస్తారు. దేశంలో మీరు ఉంటున్న స్థలములో మిమ్ములను దీవెన కరముగా ఉంచుతారు. సరేనా.
అమెరికా రాష్ట్రపతి అయిన జాన్ కెనడి ఇలా చెప్పారు. దేశం మీ కొరకు ఏమి చేసింది అని అడుగకండి, మీ దేశమునకు మీరు ఏమి చెయ్యగలరో అడిగి చూడండి అన్నారు. మన దేశం కొరకు మనం ఏమి చెయ్యగలము అని అడుగుతున్నారా? మనం మన దేశం కొరకు అందులో ఉన్న ప్రజల కొరకు ప్రార్ధించ గలము. మనలాంటి చిన్న పిల్లల కొరకు, కష్టంలో ఉన్న పిల్లల కొరకు ప్రార్ధించగలము. వీలైతే వాళ్లకు సహాయం చెయ్యగలము. ప్రముఖ్యంగా మనమందరం మన దేశ ఉజ్జీవం కొరకు ప్రార్ధించాలి. ప్రార్థన చేస్తే సరిపోతుందా ఖచ్చితంగా కాదు మనతో చదువుతున్న వాళ్లకు యేసయ్య గురించి చెప్పాలి. సరేనా పిల్లలు అందరికి 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.
- సిస్టర్. దివ్య. ఏ. టిఫా
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250