By Village Missionary Movement
Saturday, 14-Aug-2021దిన ధ్యానము(Telugu) 14.08.2021
అంశం:- మీరు ఏర్పరచబడినవారు
"మీరు నన్ను ఏర్పరచుకొనలేదు... నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని." - యోహాను 15:16
ధమస్కు వెళ్ళే మార్గంలో దేవుడు పౌలు ను దర్శించినప్పుడు పౌలు దేవుని యొద్ద నేను ఏమి చేయుటకు చిత్తగించి యున్నారు అని అడిగెను. అందుకు దేవుడు అననీయ ద్వారా తన చిత్తాన్ని బయలుపరచారు. దీనిలో నుండి మనము ఒక కార్యాన్ని గ్రహించుకోవచ్చు. దేవుడు తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుటకు మనలను ఏర్పరచుకొని యున్నారు. ఇలాగు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుని చేత ఎన్నుకొనబడిన వాళ్ళు క్రింద ఉన్న అనుభవం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది.
1.శ్రమలు,వేదనలు,అవమానాలు:- కరువు కాలంలో ఇశ్రాయేలీయులులైన గొప్ప జనాగంమును కాపాడుటకు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఎన్నుకోబడిన యోసేపు తన సహోదరుల ద్వారా, ఫోతిఫర్ భార్య ద్వారా ఎదుర్కొన్న అవమానాలు, శ్రమలు అనేకమైనవి. యేసుక్రీస్తు ను ఈ లోకమునకు మనుష్యు కుమారునిగా పంపించుటకు ఎన్నుకొనబడిన మరియ ఎదుర్కొన్న నిందలు అనేకమైనవి.
2. లోబడి ఉండవలసిన పరిస్థితి:- యూదా ప్రజలను నాశనమునుండి తప్పించుకొనుటకు ఏర్పరచబడిన వ్యక్తి ఎస్తేరు. ఒక రాణిగా ఉండినప్పటికి తన పిన తండ్రి అయిన మొర్దెకైకు లోబడి ఉండవలసిన పరిస్థితి వచ్చింది.
3. త్యాగం చేయవలసిన పరిస్థితి:- అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలీయులకు సువార్తను ప్రకటించుటకు ఎన్నుకోబడిన పౌలు తన యొక్క ప్రఖ్యాతిని, ఘనతను సుఖవంతమైన జీవితము అన్నింటిని త్యాగం చేయవలసి వచ్చింది.
ప్రియమైన వారలారా! పైన చెప్పబడిన అనుభవములు మీలో ఉంటే మీరు కూడా ప్రత్యేకమైన ఉద్దేశ్యం కొరకు దేవుని చేత ఎన్నుకోబడిన వారిగా ఉంటున్నారు. కాబట్టి మీకు నియమించబడిన పరుగులో సహనంతో, విశ్వాసంతో ఉత్సాహంతో పరిగెత్తుడి. దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్న ఉద్దేశాన్ని తన మహిమ కొరకు నెరవేర్చుతారు.
- శ్రీమతి. గీతా రిచర్డ్
ప్రార్థన అంశం:-
ప్రతి జిల్లాలోనూ యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యవ్వనస్తుల కూడిక జరిపించుటకు దేవుడు సహాయం చేయులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250