By Village Missionary Movement
Sunday, 08-Aug-2021దిన ధ్యానము(Telugu) 08.08.2021 (Kids Special)
చురుకుగా ఉండు.
"సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము" - సామెతలు 6: 6
ఉదయమున లేచి అమ్మ చేయాల్సిన పనులను, వంటలను ముగించుకొని రోహిత్ రోహిత్ అని పిలిచారు. రోహిత్ ఉదయమున లేచి సెల్ ఫోన్ తీసుకొని ఆడుతూ అమ్మ పిలిచిన పిలుపును కూడా లెక్కచేయలేదు. అమ్మ రోహిత్ ఇంకా పడుకొని ఉన్నాడేమో అని టీ తీసుకొని రోహిత్ ఉన్న గదిలోకి వచ్చారు. ఏంటి రోహిత్ ఇంతకు ముందు ఉదయాన్నే లేచి బ్రెష్ చేసుకొని అమ్మను వెతుక్కుంటున్న టి కోసం వచ్చేవాడివి మరి ఇప్పుడు ఇంత సోమరివైపోయావు. ఆన్లైన్ క్లాస్ అయిపోయిన వెంటనే టి.వి మరియు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నావు. భోజనం, స్నాక్స్, నిద్ర అంటూ రోజంతా సోమరి వలె ఉంటున్నావు ఇలా ఉండ కూడదు అని చెప్పిన వెంటనే రోహిత్ కు కోపం వచ్చింది.
టి తీసుకొని ఏంటమ్మా నా పనులు నేనే కదా చేసుకుంటున్నాను బ్రెష్ చేసుకుంటున్నాను, స్నానం చేసుకుంటున్నాను, క్లాస్ అటెండ్ అవుతున్నాను, టెస్ట్ రాస్తున్నాను వెళ్ళండి మమ్మి అని చెప్పి తోటలోకి వెళ్ళి కూర్చున్నాడు. తోటలో రకరకాల పక్షుల శబ్దం, సహజమైన వాతావరణ గాలి విస్తున్న సమయంలో తోట అందాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. అనుకోకుండా టక్కున కాలుకు చీమ కరిచింది. ఆ చీమ కరిచింది అని క్రిందకు చూసాడు. క్రింద చీమల గుంపు కనిపించింది. తనను కరిచాయి అని చెప్పి కాళ్ళతో త్రొక్కి చంపేశాడు. వెంటనే చీమలు వేరె దారిని కనుక్కుని చురుకుగా వెళ్లిపోవడం ప్రారంభించాయి. కొన్ని చీమలు రోహిత్ కాళ్ళకు ఎక్కాయి. వాటిని చూసి రోహిత్ పాఠం నేర్చుకున్నాడు. నేను కాళ్ళతో త్రొక్కిన గాని చురుకుగా వాటి పనిని అవి చేసుకుంటున్నాయే అని ఆలోచించడం ప్రారంభించాడు. అమ్మ దగ్గరకు వెళ్ళి వాటిని గూర్చి చెప్పాడు. అమ్మ ఇకమీదట నేను చీమల వలె చురుకుగా ఉంటాను మంచి ప్రవర్తనను నేర్చుకుంటాను. సోమరి వలె అని చెప్పిన రోహిత్ ను అమ్మ పొగిడారు. చీమల ద్వారా రోహిత్ ను మార్చిన యేసయ్యకు అమ్మ కృతజ్ఞతలు చెప్పారు.
పిల్లలారా మీరు కూడా సోమరి వలె తింటూ నిద్రపోతు మీ తల్లిదండ్రులు చెప్పిన వాటిని వినకుండా వుంటున్నారా? అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. స్కూల్లో ఉన్న లేదా ఇంట్లో ఉన్న ఎప్పుడు చురుకుగా ఉండాలి. సరేనా?
శ్రీమతి అన్బు జ్యోతి స్టాలిన్
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250