Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.08.2021
Share:

By Village Missionary Movement

Saturday, 07-Aug-2021

దిన ధ్యానము(Telugu) 07.08.2021

 

జయమిచ్చే దేవుడు.

 

"దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?" - రోమీయులకు 8: 31

 

ఒక రైతు మరియు అతని స్నేహితుడు అడవికి బాతులను పట్టుకొనుట కొరకు వెళ్తున్నారు. ఆ సమయంలో వారియొక్క సంభాషణ దేవుని గూర్చియై యున్నది. అప్పడు రైతు యొక్క స్నేహితుడు ఇప్పటి వరకు మీకును సాతానుకు మధ్య జరిగే పోరాటముల గురించి చెబుతున్నారు కాని నాకు ఆ విధములైన పోరాటములు ఏమి లేవు అని చెప్పాడు. దానికి ఆ రైతు మనం ఇప్పుడు వేటాడుటకు వెళ్తున్నాం ఇప్పుడు రెండు బాతులకు దెబ్బలు తగిలి దానిలో ఒకటి చనిపోయింది ఇంకొకటి తప్పించుకొని పారిపోవాలి అని చూస్తుంది. వాటిలో మీరు దేనిని వెంటాడుతారు అని అడిగాడు ఆ రైతు. దానికి ఆ స్నేహితుడు తప్పించుకొని పారిపోవాలి అని చూసే దానినే వెంటాడుతాను అన్నాడు. చనిపోయి ఉన్న ఆ బాతును మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకొనవచ్చు అని అన్నాడు. అప్పుడు రైతు మీరు చనిపోయిన బాతు అని సాతానుకు తెలుసు అని అన్నాడు.

 

యోబు తన కాలంలో జీవించే వారిలో దేవుడు మెచ్చుకొనే స్థాయిలో నీతిమంతునిగా జీవించి మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అతనిని సాతాను విడిచిపెట్టలేదు. అతని యొక్క సమస్తాన్ని దేవుని యొక్క అనుమతి ద్వారానే లాక్కున్నాడు. అంత మాత్రమే కాదు శరీర శోధనలో ఎంతగానో బాధ అనుభవించాడు యోబు. అయితే యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! యెహోవా యొక్క మార్గములలో నడిచే వారిని గుర్తించి సాతాను ఎల్లప్పుడూ దాడులు పంపిస్తూనే ఉంటాడు. ఎందుకు అనగా మనం దేవుని కొరకు ఏదైనా చేయుటకు ప్రయాస పడేవారని, వీరిని ఇలానే విడిచిపెడితే వీరు ప్రపంచాన్నే కదిలించి వేస్తారు అని సాతానుకు తెలుసు. ఆ భయంతో వాడు ఎల్లప్పుడు మనతో పోరాడుతూనే ఉన్నాడు. కాని సాతాను ఎప్పటికి గెలవలేడు ఓడిపోతాడు. వాడు ఒక్కరోజు కూడా మనలను గెలవలేడు. మనం సాతానుతో పోరాడుతూనే కొనసాగుదాం. ఎందుకనగా జమిచ్చే క్రీస్తు మన పక్కనే ఉన్నారు. ఎంత పెద్ద పోరాటం వచ్చినను దిగులు పడకండి. యేసుక్రీస్తు నామాన్ని చెప్పి జయాన్ని పొందుకుందాం. 

- బ్రదర్. హరీష్ శామ్యూల్

 

ప్రార్థన అంశం:-

మన గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతూ వస్తున్న నిర్మాణ పనులలో దేవుని హస్తం తోడైయుండు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet