Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.08.2021
Share:

By Village Missionary Movement

Thursday, 05-Aug-2021

దిన ధ్యానము(Telugu) 05.08.2021

 

కాపాడుకొనుడి.

 

"నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము" - సామెతలు 4:23

 

చాలా సంవత్సరాలకు ముందు ఒక నటుడు అమెరికా దేశానికి వెళ్ళాడు. కొన్ని నెలలు అక్కడ ఉండి తన యొక్క నాటక ప్రదర్శనను ప్రదర్శించాడు. వెంటవెంటనే అతనికి పేరు, పొగడ్తలు, మంచి జీతం దొరికింది. దాదాపుగా ఒక కోటి రూపాయల వరకు సంపాదించాడు. ఆ డబ్బులు పెట్టి ఒక మంచి వజ్రాన్ని కొన్నాడు. దానిని తన సంచిలో జాగ్రత్తగా పెట్టి తీసుకు వెళ్ళాడు. విమానం లేని ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం ద్వారా భారతదేశానికి రావడానికి 2 నెలలు పడుతుంది. అతను ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఓడలో 250 మంది ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు వీరి మధ్యలో నా నటనను చూపించి డబ్బు సంపాదించ వచ్చు అని ఆలోచించాడు. 

 

ప్రతి రోజు సాయంకాలం సమయంలో ప్రజల వినోదం కోసం ఓడ పై స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. వారితో నేను మీ దగ్గర నా నటన ప్రదర్శనను చూపించ బోతున్నాను అని చెప్పి తన దగ్గర ఉన్న వజ్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దానిని పైకి విసిరి అందరికి చూపించడం ప్రారంభించాడు. ఈ వజ్రాన్ని చూసిన వారు ఇది చాలా అందంగా ఉంది మరియు మంచి కాంతి వస్తుంది అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. అప్పుడు అతను దానిని చాలా పైకి విసిరాడు అప్పుడే ఒక పెద్ద గాలి విసిరింది అందువలన ఓడ కదలడం ప్రారంభించింది. పైకి విసిరిన ఆ వజ్రం పట్టుకోలేక పోవడంతో అది సముద్రంలో పడిపోయింది. దానిని పోగొట్టుకున్న ఆ నటుడు తన గదికి వెళ్లి ముడుచుకొని పడుకున్నాడు. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు కొన్ని నెలలుగా పాటు బాధలో మునిగిపోయాడు. సమ్సోనుకు ప్రభువు శక్తిని ఇచ్చారు, ఇశ్రాయేలీయులను పరిపాలించే అధికారం ఇచ్చారు. కాని అతను వ్యబిచారి ఒడిలో దేవుడు ఇచ్చిన శక్తిని కోల్పోయాడు. పరిశుద్ధ గ్రంధం చెబుతుంది ఫిలిస్తియులు అతనిని పట్టుకొని అతని కన్నులు ఉడదీసి అతనిని గాజాకు తీసుకువెళ్ళీ ఇత్తడి సంకెళ్లు చేత బంధించారు.

 

ఇదే విధముగా ఇంక చాలా మంది ప్రభువు ఇస్తున్న విలువైన రక్షణను నిర్లక్ష్యం చేసి పాపములో పడిపోతున్నారు. రక్షణ అనేది ఒక విలువైన నిధి. రక్షణను కోల్పోతే పరలోక రాజ్యాన్ని కోల్పోతాము. పరిశుద్ధ గ్రంధం చెబుతుంది పరలోక రాజ్యం పొలములో దాచబడిన నిధిని పోలి యున్నది. ఒక మనుష్యుడు దానిని కనుగోని తనకు దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన సమస్తమును అమ్మి ఆ పొలమును కొనెను. కాబట్టి మన రక్షణను కోల్పోయి నరకానికి వెళ్లిపోకుండా జాగ్రత్త పడదాం. పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందాం.

- బ్రదర్. పి.వి. విలియమ్స్

 

ప్రార్థన అంశం:-

మన యొక్క సేవ పరిచర్యను ప్రార్ధనతోను, కానుకలతోను ప్రోత్సాహిస్తున్న భాగస్వాముల కుటుంబములను దేవుడు ఆశీర్వదించే లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom