Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.08.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 04-Aug-2021

దిన ధ్యానము(Telugu) 04.08.2021

 

క్రీస్తు ప్రేమ.

 

"ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను" - రోమీయులకు 8:38

 

రెండు కాళ్ళు లేని జాన్సన్ అనే యవ్వనస్తుడు క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడిగా జీవించాడు. ఒక రోజు ఆదివారం ఆరాధనకు వచ్చిన బోధకుడు క్రీస్తు ప్రేమను గూర్చి చెబుతూ ప్రార్దించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడు ఈ యవ్వనస్తుడు. ఆరాధన ముగిసిన వెంటనే తన రెండు చేతులతో నడుస్తూ వచ్చి బోధకునీతో నేను మీతో సువార్తకు గ్రామములకు వస్తాను అని చెప్పాడు. మూడున్నర గంటలకు వెళ్లవసిన గ్రామ సువార్త కొరకు రెండున్నర గంటలకే వచ్చేసాడు. సువార్త పత్రికలు, క్రొత్తనిబంధన గ్రంథములు, నీరు అన్ని వాహనంలో పెట్టుకొని జాన్సన్ ను కూడా వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఆ గ్రామం వచ్చిన వెంటనే అన్నింటిని ఒక చెట్టు క్రింద పెట్టి జాన్సన్ ను కూడా ఆ చెట్టు క్రింద ఉండమని చెప్పి ఇద్దరు ఇద్దరుగా ఆ గ్రామంలోకి సువార్త పత్రికలు పంచుకుంటూ వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి జాన్సన్ కనబడలేదు. చాలా సమయం తరువాత జాన్సన్ సంతోషంతో తన చేతులతో నడుస్తూ వస్తున్నప్పుడు ఒక అతను పరిగెత్తుకొంటు వెళ్లి ఎత్తుకొని ఏంటి ఇది అని అడిగారు. పాపి నైనా నన్ను క్రీస్తు ఎంతగానో ప్రేమిస్తున్నారు అని అందరికి చెప్పావద్దా అందువలన నేను కూడా నోటితో సువార్త పత్రికలను తీసుకొని ఇంటింటికి వెళ్లి క్రీస్తు ప్రేమను ప్రకటించాను అని అన్నాడు జాన్సన్. 

 

క్రీస్తు ప్రేమను ఎరిగిన పౌలు మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రదానులైనను, ఉన్నవి అయినను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తయినను, లోతైనను సృష్టించబడినవి మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను యెడబాపవని రూఢిగా నమ్ముచున్నాను అని అన్నారు. ఇంకా మనలను ప్రేమిస్తున్న క్రీస్తు యేసు వలన వీటన్నింటిలోను జయము పొందుకొగలము అన్నారు. 

 

అవును ప్రియమైన వారలారా! మీరు క్రీస్తు యొక్క ప్రేమను ఇంతగా ఎరిగి యున్నారా? ఏదో చిన్న చిన్న పరిస్థితులు, శరీర బలహీనతలు చూస్తూ క్రీస్తు నన్ను ప్రేమించుట లేదు, నన్ను త్రోసివేసేశారు, నన్ను మరిచి పోయారు అని చెబుతున్నారా? రెండు కాళ్ళు లేని జాన్సన్ క్రీస్తు యేసు యొక్క ప్రేమను గ్రహించి ఇంటింటికి వెళ్లి దానిని వివరిస్తూ వచ్చాడు. పౌలు మనం ఎటువంటి పరిస్థితిలోనైన క్రీస్తు ప్రేమను గ్రహించ గలం అని ఆయన ప్రేమ వలన ఎటువంటి పరిస్థితుల్లో అయిన మనం జయించగలం అని చెప్పారు. ప్రభువు ప్రేమను గ్రహించిన వారమైతే ఉరకనే ఉండలేం. మనం రుచి చుసిన ప్రేమను మిగతా వారికి తెలియ పరచుటకు ప్రయాస పడదాం. దాని వలన దేశం దేవున్ని తెలుసుకుంటుంది. ఆమెన్

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ 

 

ప్రార్థన అంశం:-

ప్రతి రోజు యూట్యూబ్, ఫేస్ బుక్ లో బయటకు వస్తున్న వేధ పాఠములను అనేక మంది చూసి ఆత్మీయ జీవితంలో ఏదిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet