Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.08.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 03-Aug-2021

దిన ధ్యానము(Telugu) 03.08.2021

 

మీరు శ్రేష్ఠమైనవారు.

 

"గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు" - మత్తయి 10:31

 

మన తలలో ఉన్న తల వెంట్రుకలను దేవుడు లేక్కపెట్టి యున్నారు అనే విషయం మనకు ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. మనలను అంతగా సంరక్షించే దేవుడు మన శరీర అవయవములను గురించి, మన ప్రాణం గురించి ఎంత ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నారు అనే దాని గురించి లెక్కించి చూసి ప్రభువును స్తుతించుటకు రుణం కలిగి ఉన్నాం. ఆయన అనుమతి లేకుండా ఎటువంటి కీడు మనకు కలుగదు.

 

ఇప్పుడు ఉన్న ఈ ఘోరమైన వ్యాధి మనలను భయపెడుతోంది. ఈ పరిస్థితిలో కూడా దేవుని చిత్తం లేకుండా నా దేవుడు నా జీవితంలో దేనికి అనుమతి ఇవ్వరు అనే వాస్తవం మనం ఆయనతో కలిసి ఉన్న సంబంధంలో మాత్రమే ఉంది. భారాలు, సమస్యలు, వేదనలు, మరణాలు ఇవన్నీ వ్యాధులు ఉన్న కాలంలో మనం చూడగలము. అయితే దేవునితో ఉంటే వాటన్నింటిలో కూడా మనం మేలులు చూడగలము. 

 

కృతజ్ఞతలు చెల్లించు వారికి ఏయే మేలులు దొరుకుతాయి అంటే రక్తపోటు తగ్గుతుంది, నెమ్మదితో పండుకొనగలము, సృజనాత్మక ఆలోచన దొరుకుతుంది. ఎల్లప్పుడు మెలకువగా ఉండగలము. మిక్కిలి ఆనందముగా కనిపిస్తాము. ఎదుటివారికి సహాయం చేయగలం. సులభంగా క్షమించే స్వభావం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితిలోనూ ఇతరులపై నేరము మోపము. 

 

ప్రియమైన వారలారా! దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా పైన చెప్పబడిన అన్ని మంచి స్వభావములు పొందుకొని ఆనందంగా జీవించగలం. ఈరోజు మనం అన్ని విషయములను మన కన్నుల ముందుకు తీసుకు వచ్చి దేవునికి పూర్ణ హృదయంతో కృతజ్ఞతలు చెల్లించి ఆయనను మహిమ పరుద్దాం. ఆయనను స్తుతించుట అనేది మనం ఆయనను ప్రేమిస్తున్నాము అనేదానికి గుర్తింపు. హృదయ లోతుల నుండి మన దేవున్ని స్తుతించి, ప్రేమించి ఆయన ఇచ్చిన స్వభావములతో జీవిద్దాం. దేవుడే నా ఆశ్రయము, నా రక్షణ, నా తోడు , నా స్వస్థత, నా ఓదార్పు అని ఆయనలో మనం కలిసి జీవిద్దాం. ఆయన యొక్క సంరక్షణలో జీవించే మనం శ్రేష్ఠమైన వారమే. దేవుని స్వస్థత మనలను కాపాడునుగా. ఆమెన్!

- శ్రీమతి. సరోజ మోహన్ దాస్

 

ప్రార్థన అంశం:-

మిషనరీ పిల్లల స్కూల్ ఫీజ్ లను కట్టుటకు కావలసిన ఆవసరతలు సందించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet