Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.08.2021
Share:

By Village Missionary Movement

Monday, 02-Aug-2021

దిన ధ్యానము(Telugu) 02.08.2021

 

కోల్పోయిన వాటిని పొందుకుందాం.

 

 "మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును" - యోవేలు 2:25

 

గడిచిన కొన్ని నెలలో అనేక విషయాలలో మనం అందరం నష్టపోయాం. ఈ కరోనా రెండవ దశలో అనేక మంది వారి కుటుంబస్తులను కోల్పోయారు. వ్యాధి ప్రభావం ద్వారా వారి యొక్క శరీర బలాన్ని, ఆరోగ్యాన్ని కొల్పయారు. మరికొంత మంది తన ఉపాధిని, ఉద్యోగాలను కొల్పయారు. చాలా మంది వాళ్ళ యొక్క జీవిత ఆధారాన్ని కోల్పోయారు. చిన్న పరిశ్రమమలో పని చేసి తమ కుటుంబాలను పోషించే వారు ఇలా చెప్ప కొంటు పోతే అందరూ బాధింపబడ్డారు. అనేక మంది తమ సంపాదనను కోల్పోయారు. ఇలా చాలా విధములైన నష్టముల మధ్యలో దీనికి విడుదల ఎప్పుడు వస్తుందో అని వేచి చూస్తున్న వారికి ప్రభువు ఇస్తున్న వాగ్దానా వార్తలు మనస్సును ఉత్సాహ పరుస్తున్నాయి. మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును అని ప్రభువు చెబుతున్నారు. 

 

అందువలన మనం మన ఈనాటి పరిస్థితి గురించి కృంగిపోయి మానసికంగా బాధపడవలసిన అవసరం లేదు. ప్రభువు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మీరు నమ్మకంగా పట్టుకొనండి. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని వాడు. ఆర్థిక నష్టముల సరిచేయబడి రెట్టింపు ఆశీర్వాదం మనం పొందుకొనబోతున్నాం. ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రభువు యొక్క మాటలను మనం విశ్వసిస్తే చాలు. 

 

దీనిని చదువుతున్న ప్రియ సహోదరి, సహోదరులారా! మీ జీవితంలో కరోనా తాకిన విషయాలు ఏవి ? ఆరోగ్యమా? ఆర్థిక పరిస్థితా? పరిశ్రమల నష్టమా? మంచి వారిని కోల్పోయారా? పనిలో నష్టమా? కుటుంబంలో సమాధానమా? ఏదైనా సరే దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుని హస్తమును, ఆయన వాగ్దానములను నమ్మకంతో పట్టుకొంటే కరోనా తాకిడి వలన కోల్పోయిన బలాన్ని తిరిగి పొందుకోగలం. ఆయన హస్తాన్ని పట్టుకొని కోల్పోయిన వాటిని పొందుకొని దేవున్ని మహిమ పరుద్దాం. ఆమెన్

- శ్రీమతి. భువన ధన బాలన్

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంత జరగబోతున్న సేవలో దేవుని హస్తం తోడై ఉండి నడిపించే లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet