Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Friday, 30-Jul-2021

దిన ధ్యానము(Telugu) 30.07.2021 (Bible Characters Special)

 

ధ్రువీకరణ.

 

"ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు" - 2కోరింథీయులకు 10: 18

 

పరిశుద్ధ గ్రంధంలో వేలకొలది వ్యక్తుల పేర్లు చోటు సంపాదించుకున్నాయి. వాటిలో అనేక మంది యొక్క జీవిత పద్దతులను మరియు వారి యొక్క ప్రవర్తనలను మనం చూస్తున్నాం. వారిలో కొంత మంది గురించి దేవుడు ధ్రువీకరణ అందించి యున్నారు. అందులో మొట్టమొదటిగా దేవుని యొద్ద మంచి సాక్ష్యం పొందుకున్న వారి పేరు నోవాహు. అతని గురించి దేవుడు నీ తరము వారిలో నీవే నా ఎదుట నీటిమంతుడవై యుండుట చూచితిని అని సర్టిఫికేట్ ఇచ్చారు. నోవాహు ఎటువంటి మనుష్యుల మధ్యలో జీవించినప్పుడు ఈ సాక్ష్యం పొందుకున్నాడో తెలుసా? భూమి మీద అక్రమం పెరిగింది నరుని యొక్క హృదయంలో తలంపులు ఎల్లప్పుడు చెడ్డవై యున్న అటువంటి మనుష్యుల మధ్య జీవించి నప్పుడు నోవాహు తనను నీతిమంతునిగా కాపాడుకొన్నాడు. 

 

అదేవిధంగా యాకోబు తన యొక్క వృద్దాప్యంలో తన కుమారుడ్ని గురించి పరిశుదాత్మ సహాయంతో దీర్గదర్శనం పలికారు. అప్పుడు యోసేపు గురించి పరిశుద్దాత్ముడు అతను ఫలించేడి కొమ్మ అని సర్టిఫికేట్ ఇచ్చారు. పాపనికి లోబడి వాడిపోకుండా ఫలిస్తునే ఉన్నాడు. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోతిఫర్ భార్య యొక్క వ్యామోహనికి చేరకుండా తనను ఉత్తమునిగా కాపాడుకొన్నాడు. నేనెట్లు దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందును అన్నాడు. పాపము చేస్తున్న పరిస్థితుల్లో ప్రయోజనముగా ఉన్న పరిశుద్ధముగా కాపాడు కున్న యోసేపును దేవుడు ఐగుప్తుకు అధిపతిగా హెచ్చించాడు. 

 

దేవుని పిల్లలారా దేవుడు మన గురించి ఇటువంటి ధ్రువీకరణ ఇవ్వగలరా? ఒకవేళ మనుష్యులు మన యొక్క బాహ్యమైన నడవడికను చూసి మనలను మంచి వారు అని పిలవవచ్చు. కాని దేవుడు ఒక్కరే మన హృదయాన్ని, దానిలో సమస్తాన్ని స్పష్టంగా ఎరిగిన వారు. ఆయన మాన్ గురించి మంచి సాక్ష్యన్నీ అందించగలరా? 

 

దేవుని యొద్ద నుండి మంచి సాక్ష్యం పొందుకున్న నోవాహు, యోసేపు వంటి వారు పొందుకున్న సాక్ష్యన్నీ కాపాడుకొన్నారు. నా యొక్క తోటి విద్యార్థులు చేస్తేనే నేను చేసాను అని చెప్పిన వారు సాధారణ విద్యార్థులు. కాని బురద లోనుండే కదా తామర పుష్పం పూస్తుంది అయిన గాని ఒక బొట్టు నీటి చుక్క దాని మీద పడిన గాని త్రోసివేస్తుంది కదా. అదేవిధంగా ఈ పాపం నిండిన పరిస్థితుల్లో మనం జీవించిన పరిశుద్దాత్ముని సహాయంతో మనం పరిశుద్ధంగా దేవుని ఎదుట మంచి సాక్ష్యన్నీ పొందుకొనుటకు ప్రయత్నిద్దాం.

- శ్రీమతి. మణి మౌళి 

 

ప్రార్థన అంశం:-

12 మంది మిషనరీల మూలముగా ఆయా రాష్ట్రలలో సమర్పింపబడిన 500 మంది మిషనరీలను దేవుడు లేపి ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al