Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Thursday, 29-Jul-2021

దిన ధ్యానము(Telugu) 29.07.2021 (Bible Characters Special)

 

ఒనేసిము:-

 

"అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను" - ఫిలేమోనుకు 1:11

 

చేసిన తప్పు వలన ఒకడు పోలీసుల చేత పట్టుకొనబడి జైలుకు వెళ్లడం ఆ వ్యక్తి జీవితంలో ఒక పెద్ద నల్లని మచ్చ. తన జైలు జీవితాన్ని ముగించుకొని బయటకు వచ్చినా సరే సమాజం అతనిని జైలుకు వెళ్లిన వాడు అని చులకనగానే చూస్తుంది. 

 

ఇలా చెరసాలకు వెళ్లిన ఒక యవ్వనస్తుడు ఒనేసిము. ఈయన గురించి అపోస్తూలుడైన పౌలు ఫీలోమోను వ్రాసిన పత్రికలో కొత్త నిబంధనలో 199వ పేజీలో మనం చదవవచ్చు. ఒనేసిము ఆరోజుల్లో తన యజమానుడైన ఫిలొమోనుకు విరోధముగా చేసిన ఒక తప్పు నిమిత్తము చెరసాలలో వేయించబడ్డాడు. కాని అక్కడ అతనికి ఒక పురోగతి వేచి యుండేది. సువార్త నిమిత్తము అక్కడ చెరసాలలో అపోస్తూలుడైన పౌలు కూడా ఉన్నారు. పౌలు యొక్క ప్రేమ వలన, ప్రార్థన వలన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి రక్షించబడ్డాడు. ఒనేసిము విడుదల పొందుకున్న రోజు వచ్చింది. అతనిని క్రీస్తులో చేర్చుకోవాలని అతని యజమానుడైన ఫీలోమానుకు పౌలు వ్రాసిన పత్రికే ఫీలోమాను. 

 

ప్రియమైన వారలారా! ఈ వార్తను చదువుతున్న మీలో జీవితంలో చేసిన ఏదైనా తప్పు నిమిత్తము సమాజం, కుటుంబం, మనుష్యులు చేత ద్వేషింపబడుతున్న వ్యక్తిగా ఉండవచ్చు. లేదా ఒనేసిము వలె జైలుకు వెళ్ళి ఉండవచ్చు. మీతో మాట్లాడుటకు, మీ మీద ప్రేమ చూపించుటకు ఎవరు లేని పరిస్థితుల్లో ఉండవచ్చు. సమాజంలో ఒక విలువైన జీవితం మనకు దొరకదు అని ఆగిపోయి కూడా మీరు ఉండవచ్చు. 

 

మీకు ఒక శుభవార్తను చెబుతున్నాను యేసుక్రీస్తును మీరు విశ్వసించి ఆయనను మీరు నమ్మినప్పుడు ఆయన మీ యొక్క జీవితమునకు కాంతివంతముగా మార్చుతారు. పాపములు క్షమించబడి నేర భావన నుండి పూర్ణమైన విడుదలను పొందుకుంటారు. అది మాత్రమే కాదు మనుష్యుల కన్నులలో దయ అనే ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహిస్తారు. మీరు ఊహించని మనుష్యులు వెతికి వచ్చి మిమ్ములను ప్రేమగా చేర్చుకోనుట మీరు చూడ గలరు. క్రైస్తవ విశ్వాసులలు ఉన్న ఐక్యమైన సంఘమునకు మీరు వెళ్లినప్పుడు మీ యొక్క గడచిన కాల జీవితమును తెలుసుకొని మీ మీద నిజముగా ప్రేమ చూపి సంరక్షణ ఇచ్చే ఒక గుంపును మీరు చూస్తారు. పైన ఉన్న వచనంలో వున్నట్లుగా మునుపు ఎవనికి ప్రయోజనము లేని ఒనేసిము తరువాత అందరికి ప్రయోజనముగా మారినట్లు మీ యొక్క జీవితం కూడా అనేకులు ఆశీర్వాదంగా మారుతుంది. 

- బ్రదర్. జె. సంతోష్

 

ప్రార్థన అంశం:-

ప్రతిఒక్క రాష్ట్రాలలో ఉన్న 12 మంది మిషనరీలను దేవుడు పిలుచుకొని వచ్చేటట్లు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet