Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Wednesday, 28-Jul-2021

దిన ధ్యానము(Telugu) 28.07.2021 (Bible Characters Special)

 

బర్నబా.

 

"ఆదరణ పుత్రుడు... బర్నబా ఇతడు భూమిగలవాడై యుండి దానిని అమ్మి దాని..." - అపో.కార్యములు 4: 36-37

 

యేసుక్రీస్తు పరమునకు చేర్చుకొనబడిన తరువాత శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేయడం మొదలు పెట్టి దేవుని మాటను దైర్యంగా ప్రకటించారు. అప్పుడు విశ్వాసులైన అనేకులు వారితో కలిసి తమ భూములను, ఇండ్లను అమ్మి ధనమును అపోస్తూలుల పాదముల యొద్ద పెట్టారు. వాటిని వారు అందరికి పంచి ఇచ్చారు. ఆ రోజుల్లో తన యొక్క భూమిని అమ్మి ఇచ్చారు అని పరిశుద్ధ గ్రంధంలో తెలియ పరచబడిన వాడే ఈ బర్నబా. ఇతను ఒక లేవీ కుటుంబానికి చెందిన వాడు. లేవీయులు దేవుని సేవను చేసేవారు కనుక వారి యొద్ద పెద్ద స్థాయిలో భూములు, ఆస్తులు ఉండవు కనుక దేవుడే వారి ఆస్తి. అందువలన బర్నబా యొద్ద కూడా ఆస్తి కొంచమే ఉండి ఉండవచ్చు. కాని అతను వాటిని అమ్మి అపోస్తూల పాదముల యొద్ద పెట్టారు. ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా ఇతరులకు సహాయం చేసే మంచి మనస్సు కలవాడు. ఆ తరువాత రోజుల్లో సేవ ప్రయాణంలో కరువుతో బాధపడే వారికొరకు డబ్బు సేకరించడానికి చాలా ఆశక్తితో పాలు పొందుకున్నాడు. 

 

సేవకులను ఉత్సాహ పరిచిన బర్నబా:- ఆ రోజుల్లోనే పౌలు రక్షించబడి సేవ చేయుటకు తనను అర్పించు కున్నారు. అతని యొక్క పాత చెడు జీవితాన్ని చూసిన వారు పౌలును చేర్చు కొనుటకు సందేహ పడినప్పుడు బర్నబా యెరూషలేములో ఉన్న శిష్యులకు పరిచయం చేసారు. పౌలు యొక్క సేవ వాంఛకు బర్నబా నే సాక్షిగా నిలబడ్డారు. అల్పముగా లెక్కించబడిన మార్పును తనతో జోడించుకొని అత్యుత్తమమైన సేవకునిగా అభివృద్ది చేశారు. బర్నబా లేవీయుడు కనుక పరిశుద్ధ గ్రంధం అధికారంతో నేర్చుకున్న వాడిగా ప్రతిభ కలిగిన పౌలును స్థలం ఇచ్చి తాను ప్రదామికమైన వాడు అని అహంకారం లేకుండా మద్దతుగా నిలబడి పౌలుకు అవకాశం ఇచ్చాడు. పేతురు, పౌలు రక్త సాక్షిగా మరణించిన తరువాత అక్కడ ఉన్న విశ్వాసులు చెదిరిపోయారు. వాళ్లను ఓదార్చి ఉత్సాహ పరిచారు. వెనుదిరిగి పోతున్న క్రైస్తవులను హెచ్చరించారు. 

 

ప్రియమైన వారలారా! తనకు ఉన్న కొంచమును అమ్మిన గుణమే సేవకులను అభివృద్ధి చేసింది. అదే విశ్వాసులను ఉత్సాహ పరిచింది. తరువాత దేవుని కొరకు రక్త సాక్షిగా మరణించే విధముగా చేసింది అని అతని స్వభావం గురించి ధ్యానించిన మనము మనలను సంపూర్ణంగా దేవునికి అర్పించు కుందామా!

- శ్రీమతి. జ్యోతి ఆనంద్

 

ప్రార్థన అంశం:-

న్యూ లైఫ్ హోమ్ లో ఉన్న పిల్లల విద్య మరియు భవిష్యత్తు ఆశీర్వదించ బడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet