By Village Missionary Movement
Tuesday, 27-Jul-2021దిన ధ్యానము(Telugu) 27.07.2021 (Bible Characters Special)
పాపాత్మురాలైన స్త్రీ.
"ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను" - లూకా 7: 47
ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఈమె ఉన్న ఇంటికి ఒక పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు బోజనమునకు పిలవబడి యున్నాడు అని ఎరిగి వేగంగా అక్కడికి వెళ్ళింది. పాపములను క్షమించుటకు ఆయనకు అధికారం ఉన్నది అని గ్రహించి అతని యొద్ద సమాధానము కలుగుననే సత్యాన్ని గ్రహించింది. అందువలన రక్షణను, సమాధానమును పొందుకొనుటకు తగిన సిద్ధపాటుతో భోజనము జరుగుతున్న ఇంటికి వెళ్ళింది. ఎవరి గురించి, దేని గురించి ఆమె అందోళన చెందలేదు. ఎవరికి బయపడలేదు, సిగ్గుపడలేదు. చేతిలో అత్తరుతో ఆయన ఉన్న ఇంటికి వెళ్లి ఆయన పాదముల పై పడి ఏడ్చుచు ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆ అత్తరును పోసింది. యేసు తన యొక్క విస్తారమైన పాపములను క్షమిస్తారు అని ఆమె గ్రహించుట వలన ఎన్ని విధములగా తన ప్రేమను తెలియ పరచగలదో అన్ని విధములగా తెలియ పరిచింది. యేసు క్రీస్తు ఆమెను పొగిడారు అంటే చూడండి.
యేసుక్రీస్తు మనలను ఆ విధముగా పొగిడే స్తాయిలో ఆయనను ప్రేమిస్తున్నమా? మన యొక్క విస్తారమైన పాపములను యేసుక్రీస్తు ఎంతో ప్రేమతో ప్రేమిస్తున్నారు అనే లోతైన భావన మనకు ఉంటే మనము కూడా యేసుక్రీస్తును చాలా ఎక్కువగా ప్రేమించగలము. అలా ప్రేమించి నప్పుడు మన భయము, సిగ్గును మరచి యేసుక్రీస్తు కు సేవచేసి అతను లోక రక్షకుడు, సమాధాన ప్రభువు అని మన చుట్టూ ఉన్న వాళ్లకు తెలియ పరచగలం.
పాపముల నుండి క్షమాపణ పొందిన ఆ స్త్రీ మనలను చూసినట్లయితే ఏమి చెబుతారు? మీ దేశంలో కోట్లాది మంది యేసుక్రీస్తే పాపముల నుండి విమోచించి మోక్ష జీవితం ఇస్తారు అనేది గ్రహించ కుండా పుణ్య నదులలో స్నానం చేస్తూ వారి పాపములను విడిచి పెట్టేలా లెక్కిస్తున్నారు. బలులు అర్పించి పుణ్యక్షేత్రమునకు తీర్థయాత్రలకు వెళ్లి ఉపవాసం ఉంటూ తమ దేహములను చంపుకుంటున్నారు. ఇంకా కొంత మంది వ్యభిచారం, వేశ్య తనం, త్రాగుడు అనే చెడు అలవాట్లుకు బానిసగా మారి తమ్మును తామే పాడుచేసు కుంటున్నారు. ఎంత మంది సమాధానాన్ని కోల్పోయి ఆత్మహత్యల వైపుకు పరిగెడుతున్నారు. ఇదే పరిస్థితుల్లో ఉన్న నేను యేసే రక్షకుడు అనేది గ్రహించుట వలన పాపా క్షమాపనను పొందుకున్నాను. కాని మీ చుట్టూ వున్న ప్రజలకు మీరే కదా తెలియపరచాలి. పాపా వేదనను నేను గ్రహించుట వలననే అంగలర్చుతున్నాను. మీరు నన్ను పోలి వేగముగా సందిస్తారా?
- శ్రీమతి. గీతా రిచర్డ్
ప్రార్థన అంశం:-
ప్రార్థన గుడారమునకు సంబంధించిన సామగ్రిలు కొనుటకు కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250