Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.07.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 25-Jul-2021

దిన ధ్యానము(Telugu) 25.07.2021 (Kids Special)

 

మిర్యాము యొక్క జ్ఞానం.

 

"జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు" - సామెతలు 11:30

 

కువా కువా అనే శబ్దంతో ఒక అందమైన మగ పిల్లవాడు పుట్టాడు. పిల్లాడు చేతులను ఆడిస్తూ కాళ్ళను తంతు ఉన్నాడు. కాని ఆ ఇంటిలో అందరూ విచారంగా వున్నారు. వెంటనే తల్లి పిల్లాడిని ఏడ్వానివ్వకుండా కౌగిలించుకుంది. ఉత్సహంగా ఉండవలసిన తల్లి భయముతోను, కలత తోను ఉంది. ఎందుకో తెలుసా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలియులు అధికముగా విస్తరించిన కారణముగా వారికి పుట్టిన మగ పిల్లలను చంపి వేయమని గోరమైన ఆజ్ఞ ఇచ్చాడు అదేశపు రాజు. ఇప్పుడు చెప్పండి వారు ఎలా సంతోషంగా ఉండగలరు ఉండలేరు కదా! ఆ పిల్లవానికి అహరోను అనే అన్నయ్య, మిర్యాము అనే అక్క ఉన్నారు. తమ్ముడు పుట్టిన విషయాన్ని మిర్యాము ఎవరితో చెప్పకుండా రహస్యంగా దాచిపెట్టింది. 

 

పిల్లవాడు ఎదుగుతూ ఎక్కువగా శబ్దం చేస్తున్నాడు. అన్నయ్యను, అక్కను చూస్తూ నవ్వడం ప్రారంభించాడు. ఇక మీదట ఈ పిల్లవాడిని దాచి పెట్టాలెను అని తన అమ్మ ఆలోచించింది. వెంటనే మిర్యామును పిలిచి నదితిరమునకు వెళ్లి రెల్లు కర్రలను విరుచుకురా అని, అహరోనును పిలిచి అతికించి కీలును తీసుకురా అని చెప్పారు. వీటన్నింటిని కలిపి అమ్మ ఏమి చేస్తారు అని ఆలోచిస్తూ అమ్మ చెప్పిన పనిని పూర్తి చేసారు. అమ్మ రెల్లు కర్రతో త్వరగా ఒక పెట్టెను చేశారు. దాని లోపలకు నీళ్లు వెళ్ళకుండా కీలును పూసి పిల్లవానిని ఆ పెట్టెలో పెట్టారు. మిర్యాముకు, అహరోనుకు ఏడ్పు వచ్చింది కాని వేరే దారే లేదు. ఆ పెట్టెను నైలు నదికి తీసుకు వెళ్లి అక్కడ ఆ నదిలో ఆ పెట్టెను విడిచి పెట్టారు. మిర్యాము నది ఒడ్డున నిలబడి తమ్ముడికి ఏం జరుగుతుందో అని చూస్తువున్నది. కొంచం సమయములో యువరాణి ఆ దారిలో వచ్చింది. ఏమిటి ఆ పెట్టె అని చూడగా అందులో అందమైన పిల్లవాడు ఆకలితో ఎదుస్తున్నాడు. దూరముగా నిలబడిన మిర్యాము పరిగెత్తుకొని వచ్చి నేను వెళ్లి సహాయమునకు ఎవరినైనా తీసుకు రావాలా అని యువరాణిని తెలివిగా అడిగింది. అందుకు ఆ యువరాణి సరే అన్నవెంటనే పరిగెత్తుకొని వెళ్లి తన అమ్మనే తీసుకొని వచ్చింది. ఈ పిల్లవాడు పెద్దవాడైన వరకు ఇతనిని నా కొరకు పెంచి నాకు ఇవ్వుము అని ఆదేశించింది యువరాణి. తన పిల్లవాడిని కాపాడిన దేవునికి వందనములు చెబుతూనే మిర్యాము, తన అమ్మ ఇంటికి వెళ్లారు. 

 

పిల్లలారా! మీరు మిర్యాము తన తమ్ముడిని కాపాడటంలో ఎంత జ్ఞానంగా. అడుచుకున్నాదో చూసారా? సరే మీరు కూడా మిర్యాము వలే జ్ఞానంగా మాట్లాడాలి అనే నేను మీకు ఈ కథను చెబుతున్నాను. మీరు ఏం చెయ్యాలో తెలుసా సెలవు రోజుల్లో మీ ఇంటికి వచ్చే మీ అత్తయ్య పిల్లలు, పిన్ని పిల్లలతో తెలివిగా మాట్లాడి మీ ఊరిలో జరిగే విబిస్ కు తీసుకువెళ్ళీ వారి ఆత్మను నరకానికి వెళ్ళకుండా కాపాడండి. సరేనా?

- శ్రీమతి. జీవా విజయ్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet