Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Saturday, 24-Jul-2021

దిన ధ్యానము(Telugu) 24.07.2021 (Bible Characters Special)

 

కానాను స్త్రీ.

 

"మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను" - మత్తయి 21:22

 

యేసుక్రీస్తు తూరూ సీదోను పట్టణముల వైపు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తూన్న ఒక కానాను స్త్రీ యేసు యొద్దకు వచ్చి అపవాది చేత కఠినముగా శ్రమలు అనుభవిస్తున్న తన కుమార్తె కొరకు వేడుకోవడం ప్రారంభించింది. మొదట్లో యేసుక్రీస్తు జవాబు ఏమి చెప్పలేదు ఎందుకు అంటే ఆమె యుదురాలు కాదు ఆమె అన్యురాలు. శపించ బడిన కానానుకు చెందినది. కానాను శపించబడిన వాడు (అది 9:25) అని బైబిల్ చెబుతుంది కదా! ఆ సంతతి నుండి వచ్చినదే ఈమె. అయినప్పటికీ ప్రభువు ఆమెను విడువ లేదు. ఆమె మరల ప్రభువుని వేడుకోవడం ప్రారంభించింది. అందుకు యేసు పిల్లలు (ఇశ్రాయేలీయులు) రొట్టెను తీసి కుక్కపిల్లలకు ( అన్యజాతులకు) మంచిది కాదు అని అన్నారు. కుక్కతో నన్ను పోల్చారు అని ఆమె ఎంత మాత్రం వెనకాడలేదు. అందుకు ఆమె నిజమే ప్రభువా కుక్కపిల్లలు తన యజమానుని బల్లమీద నుండి పడు రొట్టెముక్కల చేత తమ కడుపు నింపు కుంటాయి కదా! అని చెప్పి తన్ను తాను తగ్గించు కున్నది. అందువలన ఆమె కృపను పొందుకున్నది. అది మాత్రమే కాదు ప్రభువుని వెంబడిస్తూ పిలుస్తూ తన కుమార్తె విడుదల పొందుకొనే వరకు ఆయనను విడవకుండా వెంబడించింది. ఆమెకు పట్టుదల ఆమెకు మంచి ఫలితం ఇచ్చింది. అన్నింటికీ పైగా ఆమె యొక్క విశ్వాసాన్ని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఆ క్షణమే ఆమె యొక్క కుమార్తె స్వస్థ పరచబడింది. మన యొక్క పిల్లల కొరకు మనం చేస్తున్న కార్యములలో ఈ కానాను స్త్రీ యొక్క ప్రార్థన వలె మనం చేస్తున్నమా అని ఆలోచించాలి. 

 

అవును మనము మన పిల్లల పాపము నుండి, రోగము నుండి, చెడు అలవాట్ల నుండి విడుదల పొందాలి అని కోరుకుంటున్నాం. సమస్యలు మన తలపైకి వచ్చినప్పుడు ప్రభువు దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం. సమస్య తీవ్రత తగ్గిపోయిన వెంటనే ప్రార్థన యొక్క తీవ్రతను తగ్గించేతున్నాం. కాని ఈ కానాను స్త్రీ అయితే యేసుక్రీస్తు అద్భుతం చేయడానికి ఇష్టం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆయన యొద్దనుండి ఎలాంటి జవాబు రాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కుక్క వలె తాను త్రోసివేయబడి నప్పటికి ఆమె ప్రభువుని విడిచి పెట్టలేదు. ప్రభువు ముందు తన్ను తాను తగ్గించుకుంది. పట్టుదలతో వెంబడించి విశ్వాసము ఉంచింది. ఇవి అన్ని ఆమెకు అద్బుతమును తీసుకు వచ్చింది. ఈ దినము మనము ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. నా పిల్లల విడుదలకొరకు, వారి యొక్క మేలు కొరకు ఆ కార్యములు, దీవెనలు పొందుకొనే వరకు ఎన్ని ఆటంకములు వచ్చిన పట్టుదలతో విశ్వసించి ప్రార్థన చేస్తాను, కచ్చితంగా అద్భుతాన్ని పొందుకుంటాను. దాని ద్వారా దేవుని నామము మహిమ పరచబడబోతున్నాను అని నిర్ణయించుకోండి. దేవుడు మీ విశ్వాసమును ఘన పరచును గాక! 

- బ్రదర్. డేవిడ్ దవమని

 

ప్రార్థన అంశం:-

ప్రార్థన గుడారము పనులలో జరుగుతున్న ఆలస్యం లేకుండా త్వరగా జరిగెటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet