By Village Missionary Movement
Thursday, 22-Jul-2021దిన ధ్యానము(Telugu) 22.07.2021 (Bible Characters Special)
యోబు.
"మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు"- యాకోబు 5:11
యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన అతని వలె భూమి పైన ఒక్కరు లేరు అని యెహోవా ద్వారా మాటిమాటికి ప్రసంగించబడిన ఒకే ఒక్క ధర్మశాస్త్ర వ్యక్తి యోబు. ఇతను స్వచ్ఛమైన జీవితం జీవించి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. నీటిమంతుడు అనగా దేవుని ఎదుట చక్కగా జీవించిన వాడే అని కదా! తన కుటుంబీకుల యొద్ద చిన్న తప్పులు కనిపించిన వెంటనే దేవుని యొద్ద ఒప్పుకునే వాడిగా నిలబడ్డాడు. దేవుని ప్రార్ధించుటలోను, పాప క్షమాపణ కోరుకోనుటలోను యదార్థముగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి సాతానుకు మధ్య జరిగిన సంభాషణ వల్ల తనకు కలుగుతున్న పరిణామాలు యోబుకు తెలియదు. ఒకే రోజులోనే తనకు ఉన్న 10మంది పిల్లలను, విస్తారమైన ఆస్తిని కోల్పోయినప్పటికి ప్రభువును అతను విడిచిపెట్టాలి అని అనుకోలేదు. అతను నన్ను చంపినను అతని మీద నమ్మకము కలిగి ఉంటాను అని చెప్పాడు. తనకు ఏర్పడిన బాధలు అన్నింటిని సహనముగా ఓర్చు కున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చిన తనను ప్రేమించిన నీతిమంతుడు ఉన్నాడు అని నిజముగా స్థిరముగా నిలబడుట కొరకు దేవుడు యోబును ఏర్పర్చుకున్నారు.
భార్య యొక్క పేరడీ మాటలను, స్నేహితుల యొక్క నేర కొరడాలను సహిస్తూ ఏం జరిగిన దేవున్ని వెంబడిస్తా అని నమ్మకంతో నిలబడ్డాడు. స్నేహితుల కొరకు ప్రార్థన చేసి దాని వలన యెహోవా కృపను పొందుకున్నాడు. ముగింపులో సాతాను యొక్క ఆలోచనలను అణిచి వేసి సాతానును ఓడించాడు.
ప్రియమైన వారలారా మన యొక్క విషాదం, బాధల మార్గంలో దేవుడు మనకు చాలా పాఠములను నేర్పిస్తున్నారు అనేది నిజం. కాని పాఠములను నేర్చుకోనుటకు మాత్రమే బాధలను పంపిస్తున్నారు అని చెప్పాకూడదు అని యోబు యొక్క జీవితం నుండి తెలుసుకొంటున్నాం. కావున మన యొక్క వ్యాధి బాధ, విషాదం, అని అన్నింటి యొక్క కారణం తెలుసుకొనుట కొరకు ప్రయత్నం చెయ్య కుండా సహనముగా ఉందాం. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఖండించి మాట్లాడిన బంధువులను, స్నేహితులను క్షమించి వారి కొరకు ప్రార్ధించుటకు ప్రయాసపడండి. మీరు కోల్పోయిన సుఖం, సంతోషం, సమాధానం అనే ఆగిపోయిన మేలులను దేవుడు రెట్టింపుగా ఇచ్చి మిమ్మలను ఆశీర్వదిస్తారు.
- శ్రీమతి. సరోజ మోహన్ దాస్
ప్రార్థన అంశం:-
ఈ లాక్ డౌన్ రోజుల్లో వి.ఏం.ఏం. యొక్క అత్యవసర ఆవసరతలు సంధింపబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250