By Village Missionary Movement
Wednesday, 21-Jul-2021దిన ధ్యానము(Telugu) 21.07.2021 (Bible Characters Special)
యోషీయా రాజు.
"మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు" - 2రాజులు 23:25
పరిశుద్ధ గ్రంధంలో ఇశ్రాయేలీయుల చరిత్ర అనేది చాలా ఆశక్తి కరమైనది. వారియొక్క స్పష్టమైన కార్యములు మాత్రమే కాదు హృదయ ఆలోచనలను ప్రభువు చిత్రీకరించి చూపించారు. వారియొక్క మంచి నమూనాలు కంటే మనలను హెచ్చరించే నమునాలే అనేకం. దానిలో అత్యంత చిన్న వయస్సులో రాజు అయ్యి అత్యంత ఆత్మీయ జీవితమును కొనసాగించిన వారు యోషీయా రాజు. ఇతని జీవితంలోనుండి నిశ్చయముగా అనేక కార్యములు మనము నేర్చు కోగలము. ఇప్పుడు మన దేశ పరిస్థితి చూసి నప్పుడు సమయ చక్రాన్ని తిప్పి క్రీ. పూ 639వ సంవత్సరానికి మనం వెళ్లినట్టు అయితే బాగుంటుంది. అవును అదే యోషీయా రాజు పరిపాలన కాలం.
ఇతను యూదా ప్రభువు ఇతను ధర్మశాస్త్రం భయభక్తి కలిగిన రాజు. తన 8వ సంవత్సరంలో రాజు అయి 31 సంవత్సరాలు పరిపాలన చేశారు. అతనికి ముందు పరిపాలించిన రాజులు సుమారు 70 సంవత్సరాలకు పైగా అక్రమాలు జరిగించారు. కాని యోషీయా తన చిన్న వయస్సులో ఉన్నప్పుడే దేవున్ని వెతకడం ప్రారంభించారు. బొమ్మలను, విగ్రహాలను నాశనం చేసి యూదా, యెరూషలేమును శుద్ధి చేయడం ప్రారంభించారు. 18వ సంవత్సరం వయస్సు వచ్చినప్పుడు దేవాలయాన్ని బాగు చేయుట ప్రారంభించారు. అప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కియా చేతిలో గ్రంధం (అదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు) దొరికింది. అందులో న్యాయ ప్రమానముల అనుసరించి నడువక పోవుట వలన వచ్చే శాపములను యోషీయా చదివినది విన్నప్పుడు ఇశ్రాయేలీయులు బయపడి వణికి వారి వస్త్రములను చింపుకొని తమ్మును తాము తగ్గించు కున్నారు (2రాజుకు 22:19). ఇతని గురించి గ్రంధం ఇచ్చే మంచి సాక్ష్యం ఏమిటో తెలుసా అతని వంటి రాజు అతని ముందు లేరు, అతని తరువాత లేరు.
విశ్వాసులారా! యోషీయా రాజు ఈరోజు మనలను కలుసుకున్నట్లు అయితే ఏమంటారు? పరిశుద్ధ గ్రంధంలో మొదటి ఐదు పుస్తకములను చదివినప్పుడే నా హృదయం ఉప్పొంగి పోయింది. పూర్తి గ్రంధమును ఉంచుకొని మీరు ఎలా దానిని చదవ కుండా, దానికి లోబడకుండా, దాని ప్రకారం నడుచుకోకుండా వుండగలుగుతున్నారు? జనులారా నాకు ముందు ఉన్న రాజుకు నాకు నమునగా లేరు, వారు ధర్మ శాస్త్ర గ్రంథమును వెతకలేదు. ధర్మశాస్త్ర గ్రంధం అలయములోనే పాడైపోయింది. ఎంత వేదనకరం. ఇశ్రాయేలు రాజైనా II యరొబాము కాలంలో జీవించిన యోషియా ప్రవక్త ద్వారా ప్రభువు ఇచ్చిన హెచ్చరిక మీ ఆలోచనలో ఉన్నదా? నీవు దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును మీ కుమారులను మరతును కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంధం చదవండి. దానికి లోబడండి. అది ఒక్కటే ఈ చెడు లోకంలో నికు ఉన్న దారి. నా యొక్క పరిపాలన కాలంలో జనులు నెమ్మదిగా ఉండే వారు. మీరు గ్రంథమును చదివినట్లేయుతే మీ పరిపాలకుల చేతిలోనుండి మీకు సమాధానం దొరుకుతుంది.
- బ్రదర్. పి.రామ్ కుమార్ జేమ్స్
ప్రార్థన అంశం:-
ప్రతి రోజు దిన ధ్యాన వార్త రాసి ఇస్తున్న దేవుని పిల్లలను దేవుడు తన అభిషేకముతో నింపేటట్లు ప్రార్ధించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250