Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Tuesday, 20-Jul-2021

దిన ధ్యానము(Telugu) 20.07.2021 (Bible Characters Special)

 

యెహూ.

 

"...నింషీకుమారుడైన యెహూ తోలడమువలెనే యున్న దనెను" - 2రాజులు 9: 20

 

దేవుడు తన హృదయ వాంచలను నెరవేర్చుటకు కొందరు ప్రత్యేకమైన వ్యక్తులను తమ యొక్క తైలాభిషేకం చేత అభిషేకించి వాళ్ళను ప్రత్యేకపరిచి తన యొక్క చిత్తాన్ని వాళ్ళ ద్వారా నెరవేర్చుతున్నారు. ఆ వరసలో యెహూను దేవుడు అహాబు యొక్క కుటుంబాన్ని పతనం చేయుటకు ఏర్పాటు చేసుకున్నారు. యెహూ ద్వారా ఆహాబును చంపుటకు గల కారణం ఏమిటి? యేలీషా ప్రవక్త యొక్క దినములలో అహాబు రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకొనుట వలన ప్రవక్త, అహాబు ఇంటి మీద శాపాన్ని ప్రకటించారు. అప్పుడు యెహూ యోరము రాజు క్రింద ఒక సైన్యాదిపతిగా ఉన్నారు. 

 

దేవుడు అహాబు ఇంటి వారియొక్క రక్తాన్ని ఆయన భార్య అయిన యెజెబెలు యొక్క చేతుల్లో నెరవేరేటట్లు యెహూను ఏర్పాటుచేసుకున్నారు. యెహూ దేవుని పైన పెట్టుకున్న భయభక్తి చేత తనకు ఇవ్వబడిన కార్యాన్ని త్వరగా చేసి ముగించాడు. యెజెబెలు మరియు అహాబు యొక్క కుటుంబాన్ని నాశనం చేయుటకు తన యొక్క రధమును త్వరగా నడిపెను అని బైబిల్ చెబుతుంది. మనము కూడా యెహూ వలె దేవుడు మనకు నియమించిన పనిని త్వరగా నెరవేర్చుటకు ఆత్మీయ రధమును అతి త్వరగా నదిపేదము. 

 

విస్తారమైన వ్యపచారము, మంత్రిక కార్యములతో నిండిపోయి ఉన్న యెజెబెలు యొక్క కార్యములో తాను చిక్కుకొనకుండా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం యెజెబెలును పొలములో ఉన్న ఒక పశువు వలె మార్చివేశాడు యెహూ. చనిపోబోతున్నాము అని ఎరిగి కూడా మ్యాకప్ వేసుకున్న యెజెబెలు లోకపు కార్యములో తేలిపోయి ఉండుట మనం చూస్తున్నాం. ఎన్నడూ మనం అలా ఉండ రాదు (2 రాజులు 9:30). అవును యెహూ లోకపు మత్తులో దేవుని యొక్క భక్తిని విడిచి పెట్టకుండా దేవుని కార్యాన్ని త్వరగా ముగించాడు. 

 

ప్రియమైన వారలారా! ఆ దినము సౌలుకు ప్రభువు అమలేకీయులు అందరిని నాశనము చేయమని చెప్పినప్పుడు లోబడకుండా శ్రేష్ఠమైన వాటిని భద్ర పరిచి దాచిపెట్టిన కార్యం దేవునికి కోపాన్ని తీసుకు వచ్చింది. కాని యెహూ అయితే సౌలు వలె కాదు. యెహూ వలె దేవుని యొక్క మాటకు ఉన్నది ఉన్నట్లుగా లోబడదాం. ఆఫీసులో గాని వ్యక్తిగత జీవితములో గాని దేవుడు విడిచి పెట్టమని చెబుతున్న కార్యం గ్రహించి త్వరగా చేసి ముగిద్దాం. దేవుడు ఈ విధేయతనే మనలోనుండి కోరుకుంటున్నారు. 

- బ్రదర్. కె. బెంజమిన్

 

ప్రార్థన అంశం:-

నంబికై టి. వి కార్యక్రమం చూస్తున్న అన్య ప్రజలు యేసయ్య ప్రేమను తెలుసు కొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet