By Village Missionary Movement
Monday, 19-Jul-2021దిన ధ్యానము(Telugu) 19.07.2021 (Bible Characters Special)
నయమాను.
"జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును" - సామెతలు 12:15
అనుదిన జీవితంలో మనలో అనేకమందికి మనకంటే చిన్నవారు అంటే వయస్సులో, అనుభవంలో చిన్నవారు ఏదైనా ఒక పనిని చేయమని చెప్తే దానిని అంగీకరించుటకు కొంతరికి కొంచం అసౌకర్యంగా ఉంటుంది, ఇంకా కొంతరికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. దేవుడు ప్రతిరోజు మనం కలుస్తున్న వ్యక్తులతో కలిసి తన పనిని నెరవేర్చు లాగున ప్రణాళిక కలిగి ఉంటారు. అందువలన ఇతరుల సహాయములను, ఆలోచనలను అంగీకరించుట అనేది చాలా ముఖ్యం. లేకపోతే వారి ద్వారా దేవుడు మనకు ఉంచిన ఆశీర్వాదములను కోల్పోయే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో మనకంటే చిన్న వారు మనకు సహాయం చేయగలరు. చిన్న వారి సహాయం పొందుకొనుట అనేది నాణ్యమైన నైపుణ్య స్థానం చూపించుటకు లోకం ఆలోచిస్తుంది. కాని మనం లోకస్తులము కాదు గాని మనం లోకాన్ని జయించినవారం.
సిరియా రాజు దగ్గర సైన్యాదిపతి అయిన నయమాను ఇంటిలో ఇశ్రాయేలు నుండి బందీగా తీసుకురాబడ్డ చిన్నది ఉన్నది. మహా పరాక్రమ శాలి అయిన అతను కుష్ఠురోగముచేత బాధపడుచుండెను. దానిని గ్రహించిన చిన్నది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠురోగమును బాగుచేయును అని చెప్పెను. చిన్న దాని మాట విని రాజు యొద్దకు పత్రిక తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. కాని ఏలీషా తన పనివాడిని పంపి యొర్దానులో ఏడు మార్లు మునగమని చెప్పి పంపించారు. నయమాను ఒక దేశానికి సైన్యాదిపతి మరియు రాజునకు ప్రియమైన వాడు, వేరే దేశమునుండి వచ్చాడు. కలుసుకోవలసిన వ్యక్తిని కలుసుకోలేదు కాని ఆ ఇంటి పనివాడిని కలుసుకున్నాడు. ఇదే మాటను కొంచెము ముందుకు అలోచిద్దాం. తన అంతస్తు, అధికారమును బట్టి ఏలీషా వచ్చి తనను ముట్టి ప్రార్ధిస్తాడు అనుకున్నాడు నయమాను. కాని వచ్చినది అతని దాసుడు, చేయవలసినది యొర్దాను నదిలో ఏడు మార్లు మునగడం అందువలన మిక్కిలి కోపపడి తిరిగి వెనుకకు వెళ్లుటకు ఆలోచిస్తున్నాడు. అప్పుడు తనతో ఉన్న సేవకుడు సహనంతో, ధైర్యంతో ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చెయ్యమని చెప్పిన యెడల మీరు వ చెయ్యకుందురా? అని చెప్పిన మాటను విని లోబడి నయమాను యొర్దాను నదిలో ఏడు మార్లు మునిగాడు. కుష్ఠురోగము నుండి స్వస్థత పొందిన వాడిగా తిరిగి ఇంటికి వెళ్ళాడు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీకు సహాయం చేయుటకు మీ కుటుంబంలో, గ్రమంలో, సభల్లో, స్నేహితుల మధ్యలో అనేక మందిని దేవుడు ఏర్పరిచారు. వారి ఆలోచనలను వింటున్నమా? లేదా నయమాను ఏలీషా వచ్చి నేరుగా కార్యాన్ని చెయ్యాలి అని ఎదురు చూసినట్లు దేవుడే మాట్లాడాలి, దేవుడే నాకు చెప్పాలి అని లెక్కించి మిగతా వారి మాటలను, ఆలోచనలను నిర్లక్ష్యం చేస్తున్నమా? చిన్నది దానిలో బందీ, తన క్రింద ఉన్న సేవకుడు వీళ్ళ ఇద్దరి మాట విన్నాడు నైమాను. లోబడ్డాడు, అద్భుతాన్ని పొందుకున్నాడు. మరియు మన ముందు సాక్షిగా నివబడ్డాడు. మనకు యెహోవా యందు ఉన్న ఆలోచనలు అనేకం వస్తూనే ఉంటాయి. వాటిని విని లోబడితే అద్భుతం లేకపోతే ఫలితం మన చేతిలోనే.
- బ్రదర్. ఎల్. అలగర్ సామి
ప్రార్థన అంశం:-
మనం దర్శిస్తున్న గ్రామాల్లో చిన్న పిల్లలు, యవ్వనస్తులు దేవునిలో నిలిచియుండుట కొరకు ప్రార్ధించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250